చిత్తూరు అర్బన్: చిత్తూరులోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి 39 ఫిర్యాదులు వచ్చినట్టు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఈ మేరకు ఎస్పీ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్‌లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర రాజు, చిత్తూరు డీఎస్పీ వెంకటనారాయణ సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు.


