నేడు ఏమి సమాధానం చెబుతారు నాడు బాదుడే బాదుడని ప్రచారం చేశారు నేడు నిజమైన బాదుడు ఎలా ఉంటుందో ప్రజలు తెలుసుకుంటున్నారు
నగరి: రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతోందని మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలను ఒకేసారి రూ.3లు పెంచడంతో ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎన్ని కల ముందు ఇంధనం ధరలను తగ్గించి ప్రజలకు ఊరటనిస్తామని హామీ ఇచ్చిన మంత్రి నారాలోకేష్ ఇప్పుడు ధరలు పెంచి ప్రజలకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇంధనం ధరల పెంపు ప్రభావం వాహనదారులపైనే కాకుండా రవాణా రంగం ద్వారా నిత్యావసర సరుకుల ధరలపైనా పడు తుందన్నారు. సామాన్య ప్రజల జీవనవ్య యం మరింత పెరుగుతుందన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నిక లు ముగిసేంత వరకు ఇంధనం ధరలు పెరగవని చెప్పి, ఎన్నికలు ముగిసిన వెంటనే పెంచడం ప్రజలను మోసం చేయడమేనని ఆరోపించారు. గతంలో ‘‘బాదుడే బాదుడు’’ అంటూ టీడీపీ నేతలు ప్రచారం చేశారని తెలిపారు. ఇప్పుడు నిజమైన భారం ఏమిటో ప్రజలకు చూపిస్తున్నారని విమర్శించారు.
ధరలు పెంచబోమని చెప్పిన మంత్రి లోకేష్


