రెండేళ్ల పాటు నేను సెల్ ఫోన్ చూడలే దు. స్నేహితులతో బయటకు వెళ్లలే దు. రోజుకు 14 గంటలు పుస్తకాలతోనే గడిపాను. పరీక్ష బాగా రాశాను. కచ్చితంగా సీటు వస్తుందన్న నమ్మకంతో ఉన్నా ను. కానీ పేపర్ లీకేజీ వార్త వినగానే నా ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపో యింది. లక్షలు పోసి పేపర్లు కొన్నవాళ్లకి ర్యాంకులు వస్తుంటే, మాలాంటి మధ్యతరగతి విద్యార్థుల కష్టానికి విలువే లేదా? మళ్లీ పరీక్ష రాయాలన్నా ఆ పాత ఉత్సా హం రావడం లేదు. – వివేక్, నీట్ విద్యార్థి, చిత్తూరు


