గిట్టుబాటు ధర కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

గిట్టుబాటు ధర కల్పించాలి

May 17 2026 12:30 AM | Updated on May 17 2026 12:30 AM

బంగారుపాళెం: మామిడి, పాడి రైతులకు గిట్టుబా టు ధర కల్పించాలని ఏపీ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బంగారుపాళెంలో శనివారం ఏపీ రైతు సంఘం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల ప్రకృతి వైపరీత్యాల వల్ల అకాల వర్షాలు, ఈదురుగాలులకు మామిడి కాయలు రాలిపోయాయన్నారు. వాటికి ధర రాక రోడ్లపై పడేశారన్నారు. గత ఏడాది ప్రభుత్వం మామిడి కిలో రూ.8కి నిర్ణయించినా ఆచరణలో అమలు కాలేదన్నారు. ఈ ఏడాది తక్కువ దిగుబడి వచ్చిందని, రైతులకు గిట్టుబాటుధర కల్పించాలన్నారు. జిల్లాలో ప్రైవేట్‌ పాల డెయిరీలు పాలకు కనీస మద్దతు ధర కల్పించకుండా దోపిడీ చేస్తున్నాయని చెప్పారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు, జిల్లా కార్యదర్శి శంకరన్‌, రైతు సంఘ నేతలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement