గుర్తు తెలియని వృద్ధుడి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వృద్ధుడి మృతి

May 6 2026 8:01 AM | Updated on May 6 2026 8:01 AM

పెద్దపంజాణి: మండలంలోని పలమనేరు–పుంగనూరు మార్గంలోని లింగాపురం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తు తెలి యని సుమారు 60 ఏళ్ల వృద్ధుడు మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మారెప్ప కథనం.. గుర్తు తెలియని వాహ నం ఢీకొని ఓ వృద్ధుడు లింగాపురం బస్టాప్‌ వద్ద మృతి చెందాడనే స్థానికుల సమాచారంతో ఎస్‌ఐ తన సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమి త్తం పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు తెల్లరంగు షర్టు, నీలం రంగు లైన్లుకలిగిన లుంగీ, వంకాయ కలర్‌ టవల్‌తో ఉన్నాడని, అతని వివరాలు తెలిసిన వారు పెద్దపంజాణి పోలీసులకు తెలియజేయాలని కోరారు.

బొలేరోను ఢీ కొన్న

ద్విచక్ర వాహనం

– ఒకరి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

బైరెడ్డిపల్లె: పలమనేరు–కుప్పం జాతీయ రహదారిలోని చీలంపల్లె వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని కమ్మనపల్లె పంచాయ తీ పరిధిలోని ఎర్రకదిరేపల్లె గ్రామానికి చెందిన శంకరప్ప కుమారుడు నాగార్జున (27), కృష్ణప్ప కుమారుడు నాగార్జున, కొండప్ప కుమారుడు గణేష్‌ ద్విచక్ర వాహనంపై బైరెడ్డిపల్లె నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. చీలంపల్లె వద్ద పలమనేరు వైపు వెళ్తున్న బొలేరోను వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో శంకరప్ప కుమారుడు నాగార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నాగార్జున, గణేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బైరెడ్డిపల్లె ఎస్‌ఐ చందనప్రియ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చెత్త వేశారని మహిళపై దాడి

చిత్తూరు అర్బన్‌: ఇంట్లోని చెత్త పక్కింటి వద్ద వేశారంటు ఓ మహిళపై దాడి చేసిన ఘటన చిత్తూరులోని పెద్ద దళితవాడలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. నగరంలోని పెద్ద దళితవాడకు చెందిన నాగమ్మ ఉదయం తన ఇంటిని శుభ్రం చేస్తూ చెత్తను బయట వేశారు. ఈ విషయమై పక్క ఇంట్లో ఉన్న పవన్‌ తదితరులు నాగమ్మతో వాగ్వాదానికి దిగారు. మాట మాట పెరగడంతో నాగమ్మపై దాడి చేశారు. గాయపడ్డ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టూ టౌన్‌ సీఐ నెట్టికంటయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ముందస్తు లోక్‌ అదాలత్‌

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): సుప్రీంకోర్టులో పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ముందస్తు లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక తెలిపారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి 40 కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఆ కోర్టు ఆదేశాల మేరకు ‘సమాధాన్‌–సమరోహ –2026’ కార్యక్రమంలో భాగంగా కక్షిదారులకు జిల్లా న్యాయసేవాసదన్‌ ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేస్తామన్నారు. కక్షిదారులతో ముందస్తు లోక్‌ అదాలత్‌ ద్వారా మధ్యవర్తిత్వం విధానంలో కేసులు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ముందస్తు లోక్‌ అదాలత్లో ఇరుపక్షాల దస్త్రాలను సుప్రీంకోర్టుకు నివేదించి.. అక్కడ ఆగస్టు 21, 22, 23 తేదీల్లో జరిగే ప్రత్యేక లోక్‌ అదాలత్‌లో పెండింగ్‌ కేసులను పరిష్కరించుకోవచ్చని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement