కోడెగిత్తల జోరు | - | Sakshi
Sakshi News home page

కోడెగిత్తల జోరు

May 11 2026 8:32 AM | Updated on May 11 2026 8:32 AM

● హుషారుగా సాగిన ఎడ్ల పందేలు ● పశువులను నిలువరించడానికి యువకుల పోటీ ● జనసంద్రంగా మారిన గుంతూరు దళితవాడ

బంగారుపాళెం మండలంలోని గుంతూరు దళితవాడలో ఆదివారం పశువుల పరుగు పందేలు హోరెత్తాయి. ఇక్కడికి పరిసర ప్రాంతాల నుంచి యజమానులు తమ పశువులను టెంపోల ద్వారా తీసుకువచ్చారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరుగు పందేలు నిర్వహించారు. పరుగులు తీస్తున్న కోడె గిత్తలను నిలువరించేందుకు యువకులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో పలువురు యువకులు స్వల్ప గాయాలయ్యాయి. పోటీల్లో గెలుపొందిన ఎద్దుల యజమానులకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. పశువుల పరుగు పందేలను తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో గుంతూరు దళితవాడ జనసంద్రంగా మారింది. – బంగారుపాళెం

Advertisement
 
Advertisement
Advertisement