కుప్పం: నియోజకవర్గంలో 2028 సంవత్సరానికి రోజుకు పది లక్షల లీటర్ల పాల ఉత్పత్తే లక్ష్యంగా ప్రణాళికలను అమలు చేయాలని అధికారులకు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. బుధవారం కడా కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో వ్యవసాయ రంగంలో పశుగ్రాస అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. కమ్యూనిటీ పౌడర్ డెవలప్‌మెంట్ ద్వారా పశుగ్రాస సరఫరాను పెంచాలని తెలిపారు. 2028 నాటికి 10 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తే లక్ష్యంగా చర్యలు చేపట్టాలన్నారు. సహజ వ్యవసాయం, ఉద్యాన పంటలు, పూలు, పట్టు వంటి రంగాల్లో రైతులను ప్రోత్సహించాలని కోరారు. దీంతో పాటు మామిడి, టమాట, అరటి వంటి సాంప్రదాయ పంటలతో పాటు డ్రాగన్ ప్రూట్, బ్లూబేర్రి వంటి విదేశి పంటలు సాగుకు రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలన్నారు. ఆదర్శ రైతులకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందేటట్లు చూడాలని సూచించారు. 2027 నాటికి కుప్పం సిల్క్ హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలన్నారు. కడా పీడీ వికాస్ మర్మత్, పీఎంకే ఊడా చైర్మన్ డా. సురేష్ పాల్గొన్నారు.


