పరిశ్రమలకు భూములు ఇవ్వాలని అధికారులు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నా రు. నష్ట పరిహారం ఇస్తాం.. పరిశ్రమలు వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయి.. భూములు ఇవ్వాల్సిందే అని చెబుతున్నారు. ఇప్పటికే 350 ఎకరాలు ఇచ్చాం. మళ్లీ 250 ఎకరాలు కావాలని ఇబ్బంది పెడుతున్నా రు. భూములను లాక్కుంటే గ్రామం మొత్తం ఖాళీ చేసి కూలి పనుల కోసం వలస బాట పట్టాల్సిందే.
– చెంగారెడ్డి, రైతు, పొగురుపల్లి
భయపెడుతున్నారు
సారవంతమైన పట్టా భూములు ఇవ్వాలని భయపెడుతున్నారు. ఒప్పుకోకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఏమి చేయా లో దిక్కతోచడం లేదు. మానసిన వేదనను తట్టుకోలేకపోతున్నాం. అధికారుల ఒత్తిడులను భరించకలేక ఆత్మహత్యే శరణ్యమని పెట్రోల్‌తో తహసీల్దార్ వద్దకు వెళ్లాను. మా పూర్వీకుల నుంచి వందేళ్లుగా ఇక్కడే జీవిస్తున్నాం. భూములుపోతే ఏమి చేయాలో తెలియడం లేదు.
– సోమశేఖర్‌రెడ్డి, రైతు, పొగురుపల్లి
నాలుగు ఎకరాల్లో ఒక సెంటు ఉండదు
వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నాం. నాకు పూర్వీకుల నుంచి వచ్చిన నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాన్ని ఫ్యాక్టరీలకు ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఆ భూమి మొత్తం తీసుకుంటే మాకు సెంటు భూమి కూడా ఉండదు. మా గ్రామంలో 80 కుటుంబాలు ఒక సెంటు భూమి కూడా లేకుండా కోల్పోయి గ్రామం వదిలి బయట ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
– గజేంద్రరెడ్డి, రైతు, పొగురుపల్లి
దినసరి కూలి పనులే గతి
అనేక ఏళ్లుగా వ్యవసాయాన్ని నమ్ముకుని జీవ నం సాగిస్తున్నాం. ఇప్పు డు ఫ్యాక్టరీల కోసమని ఉన్న భూములను తీసుకుంటే ఎలా బతకాలి. దినసరి కూలీలుగా మారి కూలి పనులు చేసుకోవాల్సిందే. ఎంత ప్రాధేయపడినా అధికారులు వినడం లేదు. కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. వ్యవసాయం నమ్ముకుని జీవించే రైతులం. మాపై పోలీసులు కేసులు పెడతామని బెదిరించడం ఎంత వరకు సమంజసం.
– రవికుమార్, రైతు, పోగురుపల్లి


