ఆలపాకంలో భారీ చోరీ | - | Sakshi
Sakshi News home page

ఆలపాకంలో భారీ చోరీ

May 17 2026 12:24 AM | Updated on May 17 2026 12:24 AM

విజయపురం (నగరి) : విజయపురం మండలంలోని ఆలపాకం గ్రామంలోని ఒక ఇంటిలో దొంగలు పడ్డారు. ఇంటి కిటికీని తొలగించి లోనికి చొరబడి రూ.30 లక్షల విలువైన 20 సవర్ల బంగారాన్ని చోరీ చేశారు. ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య కథనం మేరకు.. ఆలపాకం గ్రామానికి చెందిన కె.హరీష్‌కుమార్‌ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని రోజులుగా మిద్దైపె నిద్రిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన దొంగలు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఇంటి కిటికీని తొలగించి లోపలికి ప్రవేశించారు. బీరువాను పగులగొట్టి అందులో ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేశారు. శనివారం ఉదయం కిందికి దిగిన కుటుంబ సభ్యులు కిటికీలు తొలగించి ఉండడం, బీరువా పగులగొట్టి దుస్తులు చిందరవందరగా పడివుండడాన్ని గమనించి చోరీ జరిగినట్లు గుర్తించారు. బాధితుడు హరీష్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌ టీం వేలిముద్రలు సేకరించింది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement