సమస్యలు పరిష్కరించాలని వినతి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలని వినతి

May 9 2026 7:38 AM | Updated on May 9 2026 7:38 AM

● ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్న ప్రజలు ● దురుసుగా ప్రవరిస్తున్న సిబ్బంది ● కొన్నిచోట్ల మొరాయిస్తున్న వాహనాలు ● సకాలంలో ఆస్పత్రికి చేరని క్షత్రగాత్రులు ● రెండో విడత లాటరీ ఫలితాలు విడుదల ● ఏపీసీ వెంకటరమణ

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

టీచర్ల సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని ఆపస్‌ నాయకులు కోరారు. వారు డీజీఈకి వినతి పత్రం అందజేశారు.

జిల్లాలో పలుచోట్ల పిలిస్తే పలకని 108

శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026

ఆపదలో ఉన్నవారికి 108 అంటే భరోసా. ప్రమాదం జరిగినా.. ఎవరికై నా గుండెపోటు వచ్చినా.. ఏదైనా అత్యవసర పరిస్థితి కలిగినా.. గర్భిణికి పురిటినొప్పులు వచ్చినా.. ఒక్క ఫోన్‌ చేస్తే కుయ్‌కుయ్‌మంటూ నిమిషాల్లో 108 అంబులెన్స్‌ వచ్చేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రభుత్వ నిర్వహణ, పర్యవేక్షణ లోపం కారణంగా క్షేత్రస్థాయిలో పలుచోట్ల 108 వాహన సేవలు కుంటుపడ్డాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. చివరకు ప్రైవేటు వాహనాలే దిక్కుగా మారుతున్నాయి.

ప్రశ్నిస్తే సిబ్బంది

దురుసు ప్రవర్తన

అత్యవసర సమయంలో ఫోన్‌ చేసిన వారితో కొంతమంది 108 సిబ్బంది నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాల్సి ఉండగా దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు పలువురు వాపోతున్నారు. పేదలంటేనే చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.

విద్యుత్‌ సమస్యల

పరిష్కారానికి చర్యలు

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో పర్యటించి సమస్యలను గుర్తించారు. 11 కేవీ ఫీడర్ల పరంగా 33 సమస్యలు, ఎల్‌టీ లైన్ల పరంగా 17, సర్వీసు లైన్‌ 6 కలిపి మొత్తం 56 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. వాటిలో 8 సమస్యలను పరిష్కారించామన్నారు. మిగిలిన వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు.

హుండీ లెక్కింపులో రూ.1.58 కోట్ల ఆదాయం

కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఉన్న హుండీల ద్వారా రూ.1,58,76,947ల ఆదాయం వచ్చినట్టు ఈవో పెంచల కిషోర్‌ తెలిపారు. హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించినట్టు తెలిపారు. ఈ క్రమంలో రూ.1,58,76,947 నగదు, బంగారం 31 గ్రాములు, వెండి 1.20 గ్రాములు వచ్చినట్టు పేర్కొన్నారు. అలాగే గోసంరక్షణలోని హుండీల ద్వారా రూ.19,180, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.1,43,720 వచ్చిందని తెలి పారు. యూఎస్‌ఏ డాలర్లు 364, సింగపూర్‌ డాలర్లు 52, మలేషియా రింగిట్‌ ఒకటి, యూఏఈ దిర్హామ్స్‌ 70, ఆస్ట్రేలియావి డాలర్లు 500, కెనాడా డాలర్లు 20, ఇంగ్లాడ్‌ పౌండ్స్‌ 10 వచ్చాయన్నారు. కార్యక్రమంలో చైర్మన్‌ మణి నాయుడు, డీఈవో సాగర్‌బాబు, ఏఈవోలు కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, ప్రసాద్‌, ధనపాల్‌, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఏపీ ఈసెట్‌లో మెరిసిన విద్యార్థులు

– రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకు

సాధించిన కుసుమ

చిత్తూరు కలెక్టరేట్‌ : డిప్లొమా కోర్సు పూర్తి చేసి నేరుగా బీఈ, బీటె క్‌, బీఫార్మసీ కోర్సుల్లో సెకండ్‌ ఇయర్‌(లేటరల్‌ ఎంట్రీ)లో చేరేందుకు నిర్వహించిన ఏపీ ఈసెట్‌లో పలువురు విద్యార్థులు ప్రతిభ చూపారు. జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో నిర్వహించిన ఏపీ ఈసెట్‌ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఇందు లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో ఐదవ స్థానంలో నిలిచింది. జిల్లా నుంచి 422 మంది పరీక్షలకు రాయ గా 392 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 224 మంది, బాలికలు 168 మంది ఉత్తీర్ణత సాధించగా బాలురు ముందంజలో నిలిచారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 92.89 శాతం నమోదు కాగా బాలురు 91.80, బాలికలు 94.66 శాతం ఉత్తీర్ణత పొందారు. గంగాధరనెల్లూరు మండలం ఎగువకాలువ గ్రామానికి చెందిన పి.కుసుమ ఫార్మసీ విభాగంలో 146 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 9వ స్థానంలో నిలిచింది. ఆమెను పలువురు అభినందించారు.

ఆపదొస్తే అవస్థే..!

కాణిపాకం: చిత్తూరు జిల్లాలో 108 వాహనాలు 31 దాకా ఉన్నాయి. ఇవి రోజువారీగా సుమారు 5 వేల కిలోమీటర్లు తిరుగుతున్నాయని, 90 నుంచి 100 కేసులను ఆస్పత్రులకు చేరుస్తున్నట్టు అధికారుల గణంకాలు చెబుతున్నాయి. వీటిలో పలు వాహనాలు మరమ్మతులకు గురయ్యాయి. కొన్ని తరచూ రిపేర్‌ అవుతున్నాయి. వాటికి తక్షణం మరమ్మతులు చేయించడం లేదు. మూడు వాహనాలు మరమ్మతులకు గురై చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో మూలనపడ్డాయి. కొన్ని మండలాల్లో టైర్లు పాడవడం, ఇంజిన్‌్‌ సమస్యలు, బ్యాటరీ లోపాలు, ఇతర సాంకేతిక కారణాలతో వాహనాలు నిలిచిపోతున్నాయి. ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు 108 వాహన సేవలు అందడం లేదు.

ఇప్పుడే ఎందుకిలా..?

కరోనా సమయంలో 108 సేవలు ప్రజలకు ప్రాణాధారంగా నిలిచాయి. రాత్రింబవళ్లు పనిచేసి కరోనా బాధితులను ఆస్పత్రులకు తరలించాయి. అప్పట్లో 108 సిబ్బందిని ప్రజలు దేవుళ్లలా భావించారు. గత ఐదేళ్ల పాలనలో 108కు ఎక్కడా లోటు రాకుండా చూసుకున్నారు. మహానేత తీసుకొచ్చిన ఈ 108 సేవలను.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరింతంగా తీర్చిదిద్దారు. అలాంటి సేవలు ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యాయనే ప్రశ్న ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఒకప్పుడు పిలిస్తే పలికిన 108 ఇప్పుడు కాల్‌ చేసినా కనిపించకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం అన్నీ బాగానే ఉన్నాయని నివేదికలు పంపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రశ్నిస్తే.. సిబ్బంది దురుసు ప్రవర్తన

అత్యవసర సమయంలో ఫోన్‌ చేసిన వారితో కొంతమంది 108 సిబ్బంది నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాల్సి ఉండగా దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు పలువురు వాపోతున్నారు. పేదలంటేనే చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.

తక్షణం స్పందిస్తున్నాం

జిల్లాలో 31 వాహనాలున్నాయి. బ్యాక్‌ ఆప్‌గా 4 వాహనాలున్నాయి. ఆస్పత్రి ఆవరణలో ఉన్నవి కూడా ఆవాహనలే. తక్షణం మరమ్మతులు చేయిస్తున్నాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే వెంటనే పరిష్కరిస్తున్నాం. సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. చర్యలు తీసుకుంటాం.

– మోహన్‌బాబు, 108 మేనేజర్‌, చిత్తూరు

ప్రైవేట్‌ పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచిత ప్రవేశం

ఏటీఎం కేంద్రాల్లో భద్రత బ్యాంకులదే!

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో ఒకటవ తరగతిలో ఉచిత ప్రవేశాలకు కసరత్తు చేస్తున్నట్టు జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ మద్దిపట్ల వెంకటరమణ తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడు తూ విద్యాహక్కు చట్టం ప్రకారం జిల్లాలోని ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ఒకటవ తరగతిలో ఉచితంగా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రైవే ట్‌ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం రెండవ విడత లాటరీ ఫలితాలు విడుదల చేసినట్టు తెలిపారు. ఒకటి నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామన్నారు. చిత్తూరులో 35, కుప్పంలో 33, బంగారుపాళ్యంలో 20, జీడీ నెల్లూరులో 17, పలమనేరులో 12, నగరిలో 11, తవణంపల్లిలో 11, గంగవరంలో 9, వి.కోటలో 7, యాదమరిలో 6, బైరెడ్డిపల్లిలో 4, గుడిపాలలో 4, ఎస్‌ఆర్‌పురంలో 4, వెదురు కుప్పంలో 4, రామకుప్పంలో 3, ఐరాలలో 2, కార్వేటినగరంలో 2, నిండ్రలో 2, పెద్దపంజాణిలో 2, పూత లపట్టులో 1, శాంతిపురంలో 1, విజయపురంలో 1 విద్యార్థులు ఎంపికై నట్టు తెలిపారు. ఎంపికై న విద్యా ర్థుల అడ్మిషన్ల ధ్రవీకరణ ఈ నెల 16వ తేదీ వరకు పాఠశాలలో చేయించుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో ఈ నెల 17న తుది నిర్ధారణ చేస్తామన్నారు. వివరాలకు ఎంఈవోలను సంప్రదించాలని కోరారు.

చిత్తూరు అర్బన్‌ : ఏటీఎం కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలను పాటించాల్సిన బాధ్యత ఆయా బ్యాంకులపై ఉందని చిత్తూరు డీఎస్పీ వెంకటనారాయణ తెలిపారు. ఆయన శుక్రవారం చిత్తూరు నగరంలోని పోలీసు అతిథి గృహంలో బ్యాంకు మేనేజర్లతో సేఫ్టీ–సెక్యూరిటీ ఆడిట్‌ పేరిట సమీక్షా సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ ఇటీవల ఏటీఎం కేంద్రాల్లో చోరీలు జరుగుతున్నాయని తెలిపారు. దొంగలు భారీ మొత్తంలో నగదు చోరీ చేస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని బ్యాంకులు ఏటీఎం కేంద్రాల గురించి పట్టించుకోవడంలేదని తెలిపా రు. అక్కడ కనీస భద్రతా ప్రమాణాలు పాటించడంలేదన్నారు. తీరా చోరీ జరిగిన తర్వాత బాధపడుతున్నారని పేర్కొన్నారు. చోరీలు జరగకుండా ఉండేందుకు బ్యాంకర్లు పోలీసులకు సహకరించాలన్నారు. జనావాసంలేని ప్రాంతాలు, నగదు లావాదేవీలు తక్కువగా జరిగేచోట్ల ఉన్న ఏటీఎంలను మరో చోటికి తరలించాలన్నారు. ప్రతి ఏటీఎం కేంద్రంలో స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ, డీఎస్పీ సెల్‌ నంబర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. బీట్‌ పాయింట్‌ పుస్తకం పెట్టాలన్నారు. తద్వారా పోలీసులు తనిఖీ చేసే సమయంలో ఇక్కడ రికార్డు చేస్తారని తెలిపారు. సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని, కనీసం 90 రోజుల వీడియోను భద్రపరచాలన్నారు. నగదు నింపే సిబ్బంది వివరాలను ధృవీకరించాలన్నారు. ఫైనాన్స్‌ సంస్థలు బంగారు ఆభరణాల లాకర్లకు పటిష్టమైన భద్రతా గదులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టూటౌన్‌ సీఐ నెట్టికంటయ్య, తాలూకా సీఐ అశోక్‌కుమార్‌, పలు వురు బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి 8 గంటలు

తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 70,001 మంది స్వామిని దర్శించుకున్నారు. 30,085 మంది తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.77 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 8 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

పేద ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్‌ విద్య

చిత్తూరు కలెక్టరేట్‌ : పేద ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యను అందించేందుకు తాలీం ఏ హునర్‌ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మైనారిటీ, వక్ఫ్‌బోర్డ్‌ అధికారులు వెల్లడించారు. దీనికి అర్హులైన ముస్లిం విద్యార్థులు apwaqfboard. el91.com వెబ్‌సైట్‌లో ఈ నెల 12వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పదో తరగతిలో 450 మార్కులు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈలో 75 శాతం మార్కులు వచ్చిన మైనారిటీ విద్యార్థులు అర్హులని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 17వ తేదీన పరీక్ష నిర్వహిస్తారని, అందులో ఎంపికై న వారికి కార్పొరేట్‌, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో ఉచితంగా ఇంటర్‌ విద్యతో పాటు జేఈఈ, నీట్‌ తదితర పరీక్షలకు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.

– పూతలపట్టులో మూడు రోజుల క్రితం కొందరు యువకులు వ్యక్తిగత కారణాలతో ఘర్షణ పడ్డారు. ఒక యువకుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్సుకు కాల్‌ చేశారు. ఆ వాహనం సమయానికి రాలేదు. పోలీసులు పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే తమ వాహనంలోనే చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో బాధితుడికి ప్రాణాపాయం తప్పింది.

– తవణంపల్లి మండలం సత్తారుబావి గ్రామంలో 20 రోజుల క్రితం ఆటో బోల్తా పడింది. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. గంటల తరబడి చూసినా 108 వాహనం రాలేదు. దీంతో స్థానికులు ఆటోలో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మండలంలో ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగాయి. ఇలాంటి సంఘటనలు జిల్లా వ్యాప్తంగా అనేకం జరిగాయి.

గంటల తరబడి ఎదురు చూపులే..

పలు ప్రాంతాల్లో 108 సేవలు గాడితప్పడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కాల్‌ చేస్తే తక్షణ స్పందన కనిపించడం లేదు. కొన్నిసార్లు ఫోన్‌ చేస్తే అంబులెన్స్‌ ఎక్కడుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. ‘‘వాహనం వస్తోంది.. ఇంకో కేసు దగ్గర ఉంది.. కొంతసేపట్లో అక్కడికి చేరుతుంది.. అంటూ సమాధానాలు వస్తున్నా.. అంబులెన్స్‌ మాత్రం రావడం లేదు. గంటల తరబడి చూసినా వాహనం రాకపోవడంతో చివరకు స్థానికులు కార్లు, ఆటోల్లో ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో బాధితులు రక్తపు మడుగులో బాధతో గంటల తరబడి అంబులెన్స్‌ కోసం ఎదురు చూసిన సంఘటనలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రిళ్లు గర్భిణులకు పురిటినొప్పులు వస్తే కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనికితోడు పలమనేరు ఏరియా ఆస్పత్రికి వచ్చే కేసులను మెరుగైన వైద్య సేవల నిమిత్తం రెఫర్‌ చేయాలంటే 108 పలకడం కష్టంగా ఉంది. 108కు కాల్‌ చేస్తే సమయానికి రాకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. తవణంపల్లి, పూతలపట్టు, కార్వేటినగరం, ఎస్‌ఆర్‌పురం, నగరి తదితర మండలాల్లో ఈ సమస్య అధికంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement