తిరుపతి అర్బన్: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్‌ఓ మురళీకృష్ణతో కలసి మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణంపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రోడ్డు విస్తరణతోపాటు వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన అంశాలపై చర్చించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్ శారదా దేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, అడిషనల్ ఎస్పీ రవి మనోహరచారి, తిరుపతి ఆర్టీఓ రామ్మోహన్, ఏడీ సర్వేయర్ అరుణ్ కుమార్, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సుధాకర్ నాయక్, తుడా ఎస్‌ఈ రవీంద్ర, తుడా సీపీఓ దేవి పాల్గొన్నారు.


