తవణంపల్లె: జలధార పథకం కింద చేపట్టే పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం అర్ధగిరి క్షేత్రంలో ఉపాధి పథకం కింద జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఉపాధి కూలీలకు మజ్జిక, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఉపాధి శ్రామికులు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పనులు చేయాలని సూచించారు. జాబ్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ పనులు కల్పించాలని ఆదేశించారు. శ్రామికులకు వేతనాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. కందాకాల పనులను పరిశీలించారు. కార్యక్రమంలో డ్వామా ఏపీడీ మల్లికార్జున, సహాయ పథక సంచాలకులు సుబ్రమణ్యం, ఎంపీడీఓ హరిప్రసాద్ రెడ్డి, ఏపీఓ బాల, ఈసీ రమ్మ, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.


