● అధిక ఉష్ణోగ్రతల వల్లే దిగుబడి తగ్గుదల ● పట్టుపరిశ్రమ శాఖ జేడీ పద్మమ్మ | - | Sakshi
Sakshi News home page

● అధిక ఉష్ణోగ్రతల వల్లే దిగుబడి తగ్గుదల ● పట్టుపరిశ్రమ శాఖ జేడీ పద్మమ్మ

May 17 2026 12:18 AM | Updated on May 17 2026 12:18 AM

● అధిక ఉష్ణోగ్రతల వల్లే దిగుబడి తగ్గుదల ● పట్టుపరిశ్రమ శాఖ జేడీ పద్మమ్మ

త్వరలో పట్టు రైతులకు

ఇన్సెంటివ్‌

పలమనేరు: పలమనేరు ప్రాంతంలోని పట్టు రైతులకు పెండింగ్‌లోని ఇన్సెంటివ్‌ను త్వరలో డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలో జమచేయనున్నట్టు పట్టు పరిశ్రమలశాఖ సంయుక్త సంచాలకులు పద్మమ్మ శనివారం ఓ ప్రటకనలో తెలిపారు. ఈ నెల 13వ తేదీన సాక్షి దినపత్రికలో పట్టు జారుతోంది అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఆమె స్థానిక పట్టుగూళ్ల కేంద్రం అధికారి ద్వారా సమాచారం సేకరించారు. పట్టు రైతులకు ప్రోత్సాహం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా కిలో గూళ్లకు రూ.50 ఇన్సెంటివ్‌ ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేశామని తెలిపారు. ఇందుకు సంబందించిన అనుమతులు రాగానే రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తామని పేర్కొన్నారు. వేసవిలో 42 డిగ్రీల ఎండలు కాస్తుండడంతో పట్టుగూళ్ల ఉత్పత్తితోపాటు నాణ్యత కూడా తగ్గిందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement