నిధుల గ్రహణం! | - | Sakshi
Sakshi News home page

నిధుల గ్రహణం!

May 16 2026 3:07 AM | Updated on May 16 2026 3:07 AM

● పాఠశాలల పునఃప్రారంభంలోపు పూర్తయ్యేనా? ● విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన ● జిల్లాలో తూతూమంత్రంగా ‘మనబడి మన భవిష్యత్తు’ పథకం

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

కాపలాదారుడే దొంగ
ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగి విద్యుత్‌ స్తంభాలను చోరీచేసి విక్రయించిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
మన బడికి

శనివారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2026

కూటమి ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేస్తోంది. పత్రికల్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెబుతున్నా వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. అట్టహాసంగా ప్రారంభించిన మన బడి – మన భవిష్యత్‌ పథకానికి నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. కొన్ని రోజుల్లో నూతన విద్యాసంవత్సరం ప్రారంభంకానుంది. స్కూళ్లల్లో పనులు పూర్తికాలేదు. ఫలితంగా మన బడి – మన భవిష్యత్‌ పథకం రేపటి భవిష్యత్తుకు భరోసా నిస్తుందా? ప్రమాదపుటంచున విద్యార్థులను నిలబెడుతుందా? అని తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో మనబడి– మన భవిష్యత్‌ పథకం అమలుపై సాక్షి ఫోకస్‌ కథనం.

చిత్తూరు కలెక్టరేట్‌ : సర్కారు బడులను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చంద్రబాబు సర్కా రు ‘మనబడి – మన భవిష్యత్తు’ పథకానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో నిధుల లేమితో పనులు ముందుకు సాగడం లేదు. మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు ముగియనున్నాయి. పాఠశాలలు తెరిచే లోపు పనులు పూర్తి కావాల్సి ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. శిథిలావస్థకు చేరిన గదుల్లోనే పిల్లలు చదువులు సాగేలా కనిపిస్తున్నాయి. జిల్లాలో దాదాపు 40 శాతానికి పైగా పాఠశాలల్లో పనులు రూఫ్‌ లెవల్‌ వద్దే ఆగిపోయాయి. ఇందుకు చంద్రబాబు సర్కారు నిధుల మంజూరులో శ్రద్ధ చూపకపోవడమే కారణం. అప్పులు తెచ్చి పనులు మొదలుపెట్టిన కాంట్రాక్టర్లు వడ్డీలు కట్టలేక అర్ధంతరంగా పనులు నిలిపివేశారు.

అధికారుల పర్యవేక్షణ కరువు?

జిల్లా అధికారులు పనుల పర్యవేక్షణపై దృష్టి సారించడం లేదు. దీంతో జిల్లా సమగ్రశిక్ష శాఖ, ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు ఆడిందే ఆటగా వ్యవహరిస్తున్నారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా పలుచోట్ల పనులు ఆగిపోయా యి. ఈ విషయం అధికారులకు తెలిసినా, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పిల్లలకు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది?

మరో రెండు వారాల్లో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కనీసం విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఉండేలా అసంపూర్తిగా ఉన్న గదులను సిద్ధం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న నిర్మాణాలను సరిచేయాలని కోరుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పనులను చేపట్టాలని కోరుతున్నారు.

పథకం అమలులో విఫలం

గత వైఎస్సార్‌ సీపీ సర్కారు హయాంలో చేపట్టిన నాడు – నేడు పథకంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి. చంద్రబాబు సర్కారు ఆ పేరును మన బడి– మన భవిష్యత్‌గా మార్చింది. ఈ పథకం అమలు జిల్లాలో విఫలమైంది. తన సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చలేని దుస్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. ఇక జిల్లాలోని మిగిలిన బడులను ఎలా బాగుచేస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు.

నిధుల కొరత.. నిలిచిన పనులు

ఎస్‌ఆర్‌పురం మండలం చిల్లమాకులపల్లి హైస్కూల్‌లో నిలిచిపోయిన పనులు

నిధులు లేక అర్ధంతరంగా ఆగిన పనులు

జిల్లావ్యాప్తంగా వందలాది పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడలు, మరు గుదొడ్లు, తాగునీటి పైపుల ఏర్పాటు తదితర పనులకు సంబంధించిన బిల్లులను సకాలంలో చెల్లించలేదు. దీంతో కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే వదిలేశారు. కొన్నిచోట్ల స్లాబ్‌ లెవల్‌ వరకు పనులు జరిగితే, మరికొన్ని చోట్ల పునాదులకే పరిమితమయ్యాయి. నిధులు విడుదల చేయాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఆశించిన స్థాయిలో స్పందన లేద ని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఈ క్రమంలో మన బడి – మన భవిష్యత్‌ పథకం నీరుగారుతోంది.

అసంపూర్తి పనులతో ప్రమాద ఘంటికలు

జిల్లాలోని పలు పాఠశాలల ఆవరణల్లో తవ్విన గుంతలు, బయటపడి ఉన్న ఐరన్‌ రాడ్లు, నిల్వ ఉన్న భవన నిర్మాణ సామగ్రితో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. రాబోయే వర్షాకాలంలో ఈ అసంపూర్తి గోడలు, తవ్విన పునాదుల్లో నీరు నిలిచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో చిన్న పిల్లలు ఆడుకునే సమయంలో ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement