భరోసా ఏది? | - | Sakshi
Sakshi News home page

భరోసా ఏది?

May 13 2026 12:20 AM | Updated on May 13 2026 12:20 AM

పిల్లలను చాలా కష్టపడి చదివిస్తున్నాం. పేపర్‌ లీకేజీలు, పరీక్షల రద్దు వల్ల విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారు. ము ఖ్యంగా అమ్మాయిలు పదేపదే బయటకు పంపించి పరీక్షలు రాయించాలంటే భయంగా ఉంటుంది. కేంద్రం విద్యార్థుల భద్రత కంటే డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తున్నట్లు అనిపిస్తోంది. ఇలాంటి ఘటనల వల్ల విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయాల్సిన దుస్థితి వస్తుంది. ఈరోజు పేపర్‌ లీక్‌ అయిందని పరీక్ష రద్దు చేస్తే, లక్షలు కట్టి చదివించిన తల్లిదండ్రుల అప్పులు ఎవరు తీరుస్తారు? ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలి.

– రమాదేవి, విద్యార్థి తల్లి

Advertisement
 
Advertisement
Advertisement