మామిడి రైతులకు భరోసా | - | Sakshi
Sakshi News home page

మామిడి రైతులకు భరోసా

May 13 2026 12:20 AM | Updated on May 13 2026 12:20 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని మామిడి రైతు లు నష్టపోకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతామని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ భరోసా ఇచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో మామిడి సాగు, ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌ అంశాలపై పరిశ్రమల నిర్వాహకు లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని మామిడి రైతు లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ ఏడాది మామిడి గుజ్జు పరిస్థితి గతంతో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉందన్నారు. గత ఏడాదిలో నిల్వ ఉన్న మామిడి గుజ్జు ఇప్పటికే 80 శాతానికి పైగా విక్రయించడం శుభపరిణామమని చెప్పా రు. పాత నిల్వల సమస్య లేదని, కొత్త సీజన్‌ మామిడిని కొనుగోలు చేసేందుకు పరిశ్రమల యజమానులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

సకాలంలో ప్రాసెసింగ్‌

సమావేశంలో పరిశ్రమల నిర్వాహకులు సాను కూలంగా స్పందించారని కలెక్టర్‌ తెలిపారు. మామిడి ప్రాసెసింగ్‌ను నిర్ణీత సమయానికే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారన్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా తమ వంతు సహకారం అందిస్తామని పరిశ్రమల నిర్వాహకులు వెల్లడించారన్నారు. పండ్ల నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు ఈ ఏడాది 6.5 కోట్ల మామిడి కవర్లను రైతులకు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఉద్యానవన శాఖ అధికారులు, పరిశ్రమల నిర్వాహకులు పాల్గొన్నారు.

63 సమస్యల గుర్తింపు

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలో పరిధిలోని 40 సెక్షన్లలో విద్యుత్‌ అధికారులు కరెంటోళ్ల జనబాట నిర్వహించారు. అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 34 సమస్యలు, ఎల్‌టీ లైన్ల పరంగా 28, సర్వీసు లైన్‌ పరంగా ఒక సమస్య.. మొత్తం 63 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. అందులో మూ డు సమస్యలను పరిష్కరించినట్టు వెల్లడించారు.

నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం

కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన నిత్యాన్నదాన ట్రస్ట్‌కు మంగళవారం బెంగళూరుకు చెందిన ప్రశాంత్‌ అనే దాత రూ.లక్ష నగదును విరాళంగా అందజేశారు. దాతకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement