చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరులోని అపోలో నాలెడ్జ్ సిటీలో గురువారం ‘ఫిజియోక్వెస్ట్–2026’ దక్షిణ భారత స్థాయి ఇంటర్–స్టేట్ ఫిజియా లజీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి నాలెడ్జ్ సెంటర్ ఆడిటోరియంలో ఫిజియాలజీ విభాగం నిర్వహించిన ఈ కార్యక్రమంలో దక్షిణాది నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు పాల్గొని కేస్–బేస్డ్ లెర్నింగ్‌కు సంబంధించిన వినూత్న ప్రాజెక్టులు, ఎగ్జిబిట్స్‌ను ప్రదర్శించారు. అపోలో యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ హెచ్.వినోద్ భట్ మాట్లాడుతూ, ఫిజియాలజీ, బేసిక్ సైన్సెస్ వైద్య విద్యకు బలమైన పునాదులు, వైద్య విద్యలో బేసిక్ సైన్సెస్‌పై స్పష్టమైన అవగాహన ఎంతో అవసరమన్నారు. తాము విద్యార్థి దశలో బేసిక్ సైన్సెస్ అధ్యయనానికి ఎక్కువ సమయం కేటాయించేవారమని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో ఏఐఎంఎస్‌ఆర్‌డీన్‌డాక్టర్ అల్ఫ్రెడ్ జె.అగస్టీన్, ఫిజియాలజీ విభాగాధిపతి, ఆర్గనైజింగ్ చైర్‌పర్సన్ డాక్టర్ రమ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పి.విజేత, న్యాయనిర్ణేతలు డాక్టర్ శరణ్ బి.సింగ్, డాక్టర్ పి.శశికళ, అంతర్గత న్యాయనిర్ణేతలు, అధ్యాపకులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మెడికల్ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు.


