అన్షుమాలికకు అత్యున్నత డిగ్రీ | - | Sakshi
Sakshi News home page

అన్షుమాలికకు అత్యున్నత డిగ్రీ

May 11 2026 8:32 AM | Updated on May 11 2026 8:32 AM

నగరి: అమెరికాలోని బ్లూమింగ్టన్‌ ఇండియానా యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్న మాజీ మంత్రి ఆర్కేరోజా కుమార్తె అన్షుమాలికకు ఆ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్‌ విత్‌ హైఎస్ట్‌ డిస్టింక్షన్‌ పట్టా అందజేసింది. అన్షుమాలిక అమెరికాలో ప్రతిష్టాత్మకమైన ‘‘హెర్మన్‌ బి వెల్స్‌ డిస్టింగ్విష్డు సీనియర్‌’’ అవార్డు అందుకున్న తొలి భారతీయ విద్యార్థినిగా ఘనత సాధించడం, యూనివర్సిటీలో గౌరవ ప్రదర్శనగా ఉంచే బోర్డులో ఉత్తమ విద్యార్థినిగా ఈమె పేరు లిఖించిన బంగారు ఫలకం పొందుపరచడం విధితమే. అక్కడ కంప్యూటర్స్‌ సైన్స్‌ పూర్తి చేసుకున్న విద్యార్థుల్లో ప్రతిభగల వారికి అందించే గ్రాడ్యుయేట్‌ విత్‌ హైఎస్ట్‌ డిస్టింక్షన్‌ పట్టాను యూనివర్సిటీ ఆమెకు అందజేసింది. దీంతో ఆమె ఘనత మరో అడుగు ముందుకు వేసింది. సామాజిక మాధ్యమాల్లో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement