చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ప్రభుత్వ జూని యర్ కళాశాలల నాన్ టీచింగ్ సిబ్బంది ఉద్యోగోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయాలని నాన్ టీచింగ్ అసోసియేషన్ కందాటి విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖలో పెండింగ్‌లో ఉన్న నాన్–టీచింగ్ సిబ్బంది ఉద్యోగోన్నతులు వెంటనే చేపట్టాలన్నారు. ఇటీవల రికార్డ్ అసిస్టెంట్ నుంచి జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగోన్నతులు కల్పించడం హర్షణీయమన్నారు. ఇదే విధంగా మిగిలిన కేడర్‌ల ఉద్యోగోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
అంబులెన్సుపైకి
దూసుకెళ్లిన ట్రాక్టర్
పూతలపట్టు(యాదమరి): మండల పరిధిలోని రంగంపేట క్రాస్ వద్ద క్షతగాత్రులతో ప్రయాణిస్తున్న అంబులెన్సును ట్రాక్టర్ ఢీకొట్టింది. స్థానికుల కథనం మేరకు.. గురువారం మధ్యాహ్నం చితూరు నుంచి తిరుపతి వైపు అంబులెన్సు వాహనం ప్రయాణిస్తోంది. అదే సమయంలో పాలకూరు వైపుగా వస్తున్న ట్రాక్టర్ ఫ్‌లైఓవర్ వద్ద మలుపు తిరుగుతుండగా అంబులెన్సును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్సు బోల్తా పడి దెబ్బతింది. అందులో ప్రయాణిస్తున్న సిబ్బందితో పాటు రోగులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు, వాహనదారులు వెంటనే క్షతగాత్రులను బయటకు తీసి, చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.


