పలమనేరు పట్టుగూళ్ల మార్కెట్‌కు గతంలో సగటున నాలుగు టన్నుల పట్టుగూళ్లు వచ్చేవి. అయితే వేసవి కారణంగా పంటలు సరిగ్గా రాక దిగుబడి తగ్గినా సమ్మర్‌లో సైతం సగటున రెండు టన్నుల గూళ్లు వచ్చేవి. కానీ ఈ నెలలో రోజువారీ వస్తున్న గూళ్లు సగటున కేవలం 1,600 నుంచి 2,200 కిలోలుగానే ఉంది. గతంలో ఇదే మార్కెట్‌లో కిలో గూళ్ల ధర రూ.900 దాకా పలికింది. కానీ క్రమేణా తగ్గుతూ సోమ, మంగళవారాల్లో స్థానిక మార్కెట్‌లో గరిష్ట ధర రూ.625, కనిష్ట ధర రూ.380, సగటు ధర రూ.534గా ఉంది. ఈ ధరతో తమకు గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


