పలమనేరు: టమాట ధరలు ఎప్పుడుంటాయో, ఎప్పుడుండవో అర్థంగాని పరిస్థితి ఏర్పడింది. ఈ వేసవిలోనైనా ధరలు ఆశాజనకంగా ఉంటాయని ఇక్కడి రైతులు ఆశించారు. ఆ మేరకు పలమనేఏరు టమాట మార్కెట్‌లో వారం క్రితం బాక్సు (14 కిలోలు) రూ.500కు చేరింది. మళ్లీ రోజు రోజుకూ ధర తగ్గుతూ వచ్చి సోమవారం నాటికి బాక్సు ధర టాప్ రేట్ రూ.200 కాగా సగటు ధర రూ.150 పడిపోయింది. పంట కోసం పెట్టిన ఖర్చు సైతం రైతులకు దక్కేలా లేదని పలువురు ఆవేదన చెందుతున్నారు.
తగ్గిన ఎగుమతులు
బయటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు జిల్లాలోని మార్కెట్లకు పెద్దగా రావడం లేదు. ముఖ్యంగా తమిళనాడు వ్యాపారులు ఇక్కడి మార్కెట్‌కు వస్తేనే ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, వెస్ట్‌బెంగాళ్ రాష్ట్రాల్లోనూ సరుకు ఉన్నట్టు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో టమాటాకు డిమాండ్ తగ్గడం, ఆయా రాష్ట్రాల్లోనే కావాల్సినంత సరుకు అందుబాటులో ఉంది. మరోవైపు లోకల్ సరుకు ఎక్కువగా మార్కెట్‌కు చేరుతోంది. ఫలితంగా డిమాండ్ కంటే ఎక్కువగా సరఫరా ఉండడమే ఇందుకు కారణమైంది. గత వేసవిలో టమాటాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్‌కు ఎక్కువగా ఎగుమతులు జరిగేవి. ఈదఫా తగ్గినట్టు తెలుస్తోంది.
టమాట సాగు వివరాలు
వేసవిలో టమాట సాధారణ సాగు
4 వేల హెక్టార్లు
ప్రస్తుతం సాగైన పంట
3వేల హెక్టార్లు
పలమనేరు మార్కెట్‌కు వస్తున్న
లోకల్ సరుకు రోజుకి ఎనిమిది లోడ్లు


