ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడిగా చలపతిరావు | - | Sakshi
Sakshi News home page

ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడిగా చలపతిరావు

May 12 2026 5:30 AM | Updated on May 12 2026 5:30 AM

కార్వేటినగరం: ఏపీటీఎఫ్‌ చిత్తూరు జిల్లా నూతన అధ్యక్షుడిగా కె.చలపతిరావు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఆ సంఘ రాష్ట్ర ఎన్ని కల పరిశీలకులు ఎస్కే బాబు వేణుగోపాల్‌ తెలి పారు. చిత్తూరు మున్సిపల్‌ హైస్కూల్‌లో సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో రాష్ట్ర అదనపు కార్యదర్శి చెంగల్రాయమందడి ఆధ్వర్వంలో ఎన్నికలు నిర్వహించగా.. జిల్లా అధ్యక్షుడి గా చలపతిరావు, కార్యదర్శిగా గిరి, గౌరవ అధ్యక్షులుగా కిరణ్‌, అసోసియేట్‌ అధ్యక్షులుగా ద్వారకనాథ్‌రెడ్డి, ఉపాధ్యాక్షుడుగా రుద్రమూర్తి, గోవర్దన్‌శెట్టి, సురేంద్ర, కృష్ణమూర్తి, కార్యదర్శులుగా లక్ష్మీపతి, దినకరన్‌, లత, సురేష్‌, వరదరాజు, రెడ్డివాణి, యుగంధి ఎన్నికై నట్టు రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు తెలిపారు. గతంలో పనిచేసిన జిల్లా నాయకులు కిరణ్‌, చిట్టిబాబు సేవలను పలువురు వక్తలు కొనియాడారు. సీనియర్‌ నాయకులు గుర్రప్ప, మునికృష్ణయ్య, రాజేంద్రనాయుడు, త్యాగ రాజునాయుడు, పురుషోత్తం, శ్రీనివాసులు, బాబు, గుర్రప్ప పాల్గొన్నారు.

చిత్తూరు జాతరకు

పటిష్ట బందోబస్తు

చిత్తూరు అర్బన్‌: చిత్తూరులో రెండు రోజుల పాటు నిర్వహించనున్న గంగజాతరకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తుషార్‌ డూడీ తెలిపారు. సోమవారం ఆయన చిత్తూరులో మీడియాతో మాట్లాడారు. నగరంలో దాదాపు 600 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులతో మాట్లాడి అన్ని వసతులు పరిశీలించామన్నారు. వివాదాలకు తావులేకుండా పండుగను సవ్యంగా జరుపుకోవడానికి అందరూ సహకరించాలని కోరారు.

వీఆర్‌కు కుప్పం సీఐ

చిత్తూరు అర్బన్‌: కుప్పం టౌన్‌ సీఐ శంకరయ్యను వీఆర్‌ (వేకెంట్‌ రిజర్వు)కు తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం చిత్తూరు ఎస్పీ తుషార్‌ డూడీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌చార్జ్‌గా రూరల్‌ సీఐ మల్లేష్‌యాదవ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా శంకరయ్యపై స్థానిక టీడీపీ నేతల ఫిర్యాదుతోనే చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement