మామిడి రైతులను ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మామిడి రైతులను ఆదుకోవాలి

May 7 2026 8:20 AM | Updated on May 7 2026 8:20 AM

● పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సునీల్‌కుమార్‌

బంగారుపాళెం: మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సునీల్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం మండలంలోని మొగిలివెంకటగిరి గ్రామంలో మాజీ సమితి అధ్యక్షుడు తులసీరామకృష్ణారెడ్డి నివాసంలో స్థానిక నాయకులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గత రెండు రోజులుగా అకాలవర్షం, పెనుగాలల ధాటికి మామిడితోటల్లో కాయలు నేలపాలయ్యాయన్నారు. గాలీవానకు తోటల్లో టన్నుల కొద్దీ మామిడి కాయలు నేలరాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందన్నారు. రాలిన మామిడి కాయలను రైతులు మార్కెట్‌కు తీసుకు వెళ్తే వ్యాపారులు కిలో రెండు రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కూలీలు, రవాణా ఖర్చులు సైతం రాక ఆర్థికంగా నష్టపోతున్నట్లు చెప్పారు. పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు మామిడి రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నట్లు వాపోయారు. గత సంవత్సరం పంట చేతికి అందినా గిట్టుబాటు ధర లేక నష్టాలపాలయ్యారన్నారు.సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, మండల పార్టీ కన్వీనర్‌ రామచంద్రారెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్‌ కుమార్‌రాజా, వైస్‌ ఎంపీపీ శిరీష్‌రెడ్డి, నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడు పాలాక్షిరెడ్డి, మాజీ సర్పంచులు ప్రకాష్‌రెడ్డి, థామస్‌, రాజా, వడ్డెర కార్పొరేషన్‌ మాజీ రాష్ట్ర డైరెక్టర్‌ మొగిలీశ్వర్‌, సోషియల్‌ మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిషోర్‌కుమార్‌రెడ్డి, మాజీ జిల్లా యూత్‌ ఉపాధ్యక్షుడు మహేంద్ర, మండల మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు షాకీర్‌, మండల యూత్‌ అధ్యక్షుడు గజేంద్ర, మాజీ మండల యూత్‌ అధ్యక్షుడు గజదీష్‌, ఉప సర్పంచులు రఘు, కుమార్‌స్వామి, మండల పార్టీ కార్యవర్గ సభ్యులు ఖాదర్‌బాషా, బాలాజీ, తగ్గువారిపల్లె జగదీష్‌, చిట్టి, త్రిలోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement