తిరుపతి అన్నమయ్యసర్కిల్: ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 2020 బ్యాచ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారి అనురాగ్ మీనా బుధవారం తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల (ఎస్వీ జూపార్క్) క్యూరేటర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అటవీ సంరక్షకుడిగా పదోన్నతి పొంది కర్నూలు సర్కిల్‌కు బదిలీ అయిన సెల్వం స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. రాజస్థాన్‌కు చెందిన అనురాగ్ మీనా వన్యప్రాణుల నిర్వహణలో తనకున్న అపారమైన అనుభవంతో కొత్తగా బాధ్యతలను చేపట్టారు. ఇంతకుముందు రైల్వే కోడూరులో సబ్–డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (సబ్–డీఎఫ్‌ఓ)గా, ఆ తర్వాత నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని నంద్యాలలో ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. బాధ్యతలు స్వీకరించేందుకు విచ్చేసిన అనురాగ్ మీనాకు ఎస్వీ జంతు ప్రదర్శనశాల అధికారులు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.


