చిత్తూరు అర్బన్ : నిత్యం మొబైల్ ఫోన్ చూడొద్దని తల్లిదండ్రు లు మందలించడంతో ఇంటర్ విద్యార్థి ఆత్మ హత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివా రం చిత్తూరులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు నగరం తంగవేలు కాలనీకి చెందిన శక్తివేల్ (17) స్థానికంగా ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల మొబైల్‌తో ఎక్కువ సేపు గడుపుతుండడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో కలత చెందిన బాలుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
నేడు జేఈఈ అడ్యాన్స్‌డ్ పరీక్ష
తిరుపతి సిటీ: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఆదివా రం జరగనుంది. తిరుపతి –కరకంబాడి రోడ్డు లోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో 100 మంది, జూపార్క్ సమీపంలోని అయాన్ డిజిటల్ సెంటర్‌లో 650 మంది పరీక్షకు హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పేపర్–2 పరీక్ష జరగనుంది.


