బిడ్డకు పాలు పట్టి.. షూటింగ్‌కి వెళ్లా.. ఎవరూ అలా చెప్పరు: నటి | Rani Mukerji Remember Her Career Starting Struggles, Hichki Shooting Experience | Sakshi
Sakshi News home page

బిడ్డకు పాలు పట్టి..షూటింగ్‌కి వెళ్లా.. ఎవరూ అలా చెప్పరు!

Oct 14 2025 4:56 PM | Updated on Oct 14 2025 6:47 PM

Rani Mukerji Remember Her Career Starting Struggles, Hichki Shooting Experience

రంగంలో అయినా మహిళలు రాణించాలంటే.. చాలా త్యాగాలు చేయాల్సిందే. ఒకవైపు ఫ్యామిలీ బాధ్యతలను చూసుకుంటూనే మరోవైపు ఎంచుకున్న రంగంపై ఫోకస్చేయాలి. ఎన్నో కష్టాలను అనుభవిస్తే కానీ రంగంలో ఉన్నతస్థానానికి చేరుకోలేరు. చిత్రపరిశ్రమలో కష్టాలు ఇంకాస్త ఎక్కువే ఉంటాయి. ఫ్యామిలీ బాధ్యతతో పాటు వేధింపులను, ఒత్తిడిని తట్టుకొని నిలబడితేనేస్టార్‌’ హోదా పొందుతారు. అలాంటి కష్టాలను ఎన్నో భరించే స్థాయికి వచ్చానని చెబుతున్నారు బాలీవుడ్స్టార్హీరోయిన్రాణి ముఖర్జీ(Rani Mukerji). ఇటీవలే ఉత్తమన నటిగా జాతీయ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నమె.. కెరీర్ప్రారంభంలో తకు ఎదురైన ఇబ్బందుల గురించి వివరించింది.

ఇండస్ట్రీలోకి రావడానికి చాలా పోరాటాలే చేయాల్సి వచ్చింది. నేను ఇండస్ట్రీలోకి రావడం మా పెరెంట్స్కి ఇష్టమే లేదు. బలవంతంగా ఒప్పుకున్నారు. వారి పేరు చెడగొట్టకూడనే ఉద్దేశ్యంతో నేను కమిట్మెంట్తో పని చేశాను. నేను నటించినహిచ్కీసినిమా షూటింగ్సమయంలో నా కుమార్తె అదిరాకి కేవలం 14 నెలల వయసు మాత్రమే. అప్పటికీ పాలు పడుతున్నా. ఉదయం ఆరున్నర గంటలకు పాలు పట్టించి.. షూటింగ్కి వెళ్లేదాన్ని. ఒంటి గంటలోపు నా పార్ట్పూర్తి చేసుకొని తిరిగి నా బిడ్డకు పాలు ఇవ్వడానికి ఇంటికి వచ్చేదాన్ని

రోజుకు 6-7 గంటలు షూటింగ్చేసి.. ఇంటికి వెళ్లేదాన్ని. మా దర్శకుడితో పాటు యూనిట్అంతా నాకు సపోర్ట్చేసేది. సినిమా మొత్తం అలానే పూర్తి చేశా. ఇప్పుడు పని గంటల గురించి పెద్ద చర్చే జరుగుతుంది. నిర్మాతకు, దర్శకుడికి ఓకే అయితే సినిమా చేయాలి. లేదంటే సినిమా మానేయాలి. అది మన చేతుల్లో ఉంటుంది. కచ్చితంగా సినిమా చేయాల్సిందే అని ఎవరు చెప్పరుఅని రాణి ముఖర్జీ అన్నారు

ఇక జాతీయ అవార్డు గురించి మాట్లాడుతూ.. ‘నటీనటులుకు చిన్న పురస్కారం కూడా చాలా గొప్పదే. అయితే అవార్డు అయినా.. అర్హత గలవారికి వచ్చిందని ప్రేక్షకులు భావించాలి. నాకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు అందరూ అంగీకరించారు. అలా అందరూ అంగీకారం తెలపడం నాకు అవార్డు కంటే చాలా గొప్పగా అనిపించిందిఅన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement