ప్రీతి నిగమ్, రామ్, భాను ప్రసాద్, సురేష్ రాజ్, బ్రహ్మానందం రెడ్డి కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘రాబందు’. జయశేఖర్ కల్లు దర్శకత్వంలో పులిజాల సురేష్ నిర్మించిన చిత్రం ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని సినిమాటోగ్రఫి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిలీజ్ చేసి యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు.
అనంతరం గెస్ట్ గా వచ్చిన దర్శకుడు సముద్ర లిరికల్ సాంగ్ ను విడుదల చేయగా చిత్ర నటి ప్రీతీ నిగమ్ టీజర్ లాంచ్ చేశారు. ఇంకా సెన్సార్ బోర్డు మెంబర్ ఉపేంద్ర , రేణుకుమార్, చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రీతి నిగమ్ మాట్లాడుతూ..ట్రైలర్ చూస్తుంటే నాకు గూస్ బమ్స్ వచ్చాయి. అంత బాగా ఉంది. రాబందు అనే పక్షి ఎంత పట్టుదలతో ఉంటుందో ఈ సినిమా స్టోరీలో కూడా అదే పట్టుదలే కనిపిస్తుంది. ముఖ్యంగా మా డైరెక్టర్ & ప్రొడ్యూసర్ గారికి కాంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఎందుకంటే ఒక సినిమా తీయాలి అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. తన కష్టార్జితాన్ని మొత్తం సినిమా కోసం పెట్టడం అనేది ఒక చాలా ధైర్యం కావాలి. ఆలా సినిమా మీదున్న ప్యాషన్ తో మంచి సినిమా తీసిన ఇలాంటి ప్రొడ్యూసర్స్ ని డెఫినెట్ గా ఎంకరేజ్ చేయాలి. నేను ప్రేక్షకులందరినీ చెప్పేది ఏంటంటే, దయచేసి సినిమా థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి ఆదరించండి’ అన్నారు .
ప్రముఖ దర్శకుడు సముద్ర మాట్లాడుతూ.. యానిమల్ సినిమా లాగా రాబందు టైటిల్ చాలా మాస్ ఉంది. టైటిల్ లాగే ఈ సినిమా కూడా వైలెంట్ గా ఉంటుందనుకుంటున్నాను. ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.
చిత్ర దర్శకులు జయశేఖర్ కల్లు మాట్లాడుతూ.. నేటిసమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలన ఆధారంగా భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో పులిజాల ఫిలిమ్స్ బ్యానర్ మీద మేము నిర్మించిన చిత్రం రాబందు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మా చిత్రాన్ని చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను’ అన్నారు.


