
Srirangapuram Movie Trailer Launched By Director V Samudra: వినాయక్ దేశాయ్, పాయల్ ముఖర్జీ, వైష్ణవీ సింగ్, చిందనూరు నాగరాజు, సత్యప్రకాశ్ ముఖ్య తారాగణంగా ఎమ్‌ఎస్. వాసు దర్శకత్వంలో చిందనూరు నాగరాజు నిర్మించిన చిత్రం ‘శ్రీరంగపురం’. ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు వి. సముద్ర రిలీజ్ చేశారు.
‘‘నేను ముంబై నుంచి వచ్చాను. తెలుగు అంటే చాలా ఇష్టం. అందుకే ఇక్కడే ప్రయత్నాలు చేస్తున్నాను.. ఇక ఈ చిత్రం విషయానికి వస్తే.. అప్పట్లో ‘గోరింటాకు’కి ఎంత ఆదరణ లభించిందో అందరికీ తెలిసిందే. అదే తరహాలో బెస్ట్ సెంటిమెంట్ చిత్రంగా ‘శ్రీరంగపురం’ నిలిచిపోతుంది’’ అన్నారు వినాయక్ దేశాయ్. ‘‘మేనకోడలు–మేనమామ బంధం ఎంత గొప్పదో చెప్పే చిత్రం ఇది. మేనకోడలి కోసం మేనమామ తన ప్రాణాలను సైతం వదులుతాడు’’ అన్నారు దర్శక–నిర్మాతలు.