సస్పెన్స్‌ థ్రిల్లర్‌..

TFCC Chairman RK Goud Attend New Movie Launch  - Sakshi

‘‘తెలుగు చిత్ర పరిశ్రమకి సరి కొత్త ఆలోచనలతో ఎందరో అడుగుపెడుతున్నారు. వైవిధ్యమైన సినిమాలు తీసి సక్సెస్‌ అవుతున్నారు. యంగ్‌ అండ్‌ డైనమిక్‌ టీం రూపొందిస్తున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు సముద్ర అన్నారు. చెన్నకుని శెట్టి(కుమార్‌) దర్శకత్వంలో భరతవర్ష క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న నూతన చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

‘‘మైథలాజికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. వినోదంతో పాటు, విస్మయానికి గురి చేసే అంశాలున్నాయి’’ అన్నారు శెట్టి. ‘‘కొత్త ట్రెండ్‌ సృష్టించే అన్ని అంశాలు మా కథలో ఉన్నాయి’’ అన్నారు జి.వి.ఆర్‌.–4 మ్యూజిక్‌ అధినేత వి. గోపాలకృష్ణ. తెలంగాణ ఫిల్మ్‌చాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ , కార్యదర్శి సాయివెంకట్‌ పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top