శేఖర్ మోడల్ హీరోగా నటించి, స్వీయ రచన, దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఒక్క అడుగు’. సిరి క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌కి తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ అశోక్ కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, నిర్మాతలు పద్మిని నాగులపల్లి, రామ సత్యనారాయణ, డైరెక్టర్ సముద్ర, సత్య మాస్టర్ అతిథులుగా హాజరై, ‘ఒక్క అడుగు’ విజయం సాధించాలన్నారు.
శేఖర్ మోడల్ మాట్లాడుతూ–‘‘డైరెక్టర్ దేవ కట్టాగారి వద్ద పని చేశాను. సినిమాల్లో చాన్స్ రావడం కష్టంగా ఉంది. నాకు నేనే అవకాశం కల్పించుకుంటూ ‘ఒక్క అడుగు’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. మా చిత్రాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, కెమెరా: సతీష్ ముత్యాల.


