
సూర్య లేటెస్ట్ మూవీ 'రెట్రో'. తెలుగులో రిలీజైన మొదటిరోజు నుంచే ఘోరమైన టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా పెద్దగా రావట్లేదు. మరోవైపు తమిళంలో మాత్రం ఈ సినిమాకు మంచి టాక్, వసూళ్లు వస్తున్నాయి. దీంతో ఎలాగోలా వంద మార్క్ దాటేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.
గతేడాది సూర్య నటించిన కంగువ సినిమా రిలీజైంది. దీనిపై సూర్యతో పాటు అభిమానులు గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ డిజాస్టర్ అయింది. దీంతో 'రెట్రో'తో కమ్ బ్యాక్ గ్యారంటీ అనుకున్నారు. కానీ ఇది తమిళనాడు వరకే పరిమితమైనట్లు కనిపిస్తుంది. తాజాగా ఐదు రోజుల తర్వాత రూ.104 కోట్ల గ్రాస్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు.
(ఇదీ చదవండి: చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!)
ఎలాగైతేనేం సూర్య మూవీకి రూ.100 కోట్లు వచ్చేశాయి. ఈ విషయంలో అందరూ సంతోషంగా ఉన్నప్పటికీ తెలుగులోనూ హిట్ అయ్యింటే ఈ నంబర్స్ మరింత పెరిగేవి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరోవైపు నాని హిట్ 3 చిత్రానికి నాలుగు రోజుల్లోనే రూ.101 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ రోజు పోస్టర్ ఇంకా రిలీజ్ చేయలేదు. ఈ లెక్కన చూసుకుంటే సూర్య కంటే నానినే ముందున్నాడు.
ప్రస్తుతం సూర్య.. తమిళ నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. త్రిష హీరోయిన్. ఇప్పటికే షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ దీపావళికి రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. దీని తర్వాత తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో సూర్య సినిమా చేయబోతున్నాడు. అధికారికంగా ఇదివరకే ప్రకటించేశారు కూడా.
(ఇదీ చదవండి: జీవితంలో ఇంకెప్పుడు దాని గురించి మాట్లాడను: సమంత)
