
కోలీవుడ్ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా పెట్టాలెక్కింది. సూర్యకు రెట్రో, వెంకీ అట్లూరికి లక్కీ భాస్కర్ చిత్రాలు మంచి విజయాన్ని ఇచ్చాయి. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్‌ను తాజాగా ప్రారంభించారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుంది. జీవీ ప్రకాశ్ సంగీతం అందించనున్నారు.
హిట్ ఫిల్మ్ ‘సార్’ (2023) (తమిళంలో ‘వాతి’), దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ సినిమాల కోసం ఇతర భాషలకు చెందిన హీరోలను ఎంపిక చేసుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి.. ఇప్పుడు మళ్లీ తమిళ హీరో సూర్యతో మరో సినిమా ప్లాన్ చేయడం విశేషం. త్వరలో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.