సూర్య కొత్త సినిమా.. స్టార్‌ నటుడి సతీమణికి ఛాన్స్‌ | Nazriya Nazim chance with Suriya 47th movie | Sakshi
Sakshi News home page

సూర్య కొత్త సినిమా.. స్టార్‌ నటుడి సతీమణికి ఛాన్స్‌

Dec 7 2025 2:09 PM | Updated on Dec 7 2025 2:55 PM

Nazriya Nazim chance with Suriya 47th movie

కోలీవుడ్‌ టాప్‌ హీరో సూర్య 47వ సినిమా ప్రారంభమైంది. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు.  తాజాగా పూజా కార్యక్రమం ప్రారంభమైంది. అందుకు సంబంధించిన పోటోను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. జీతూ మాధవన్‌ ఇప్పటికే రోమాంచమ్‌, ఆవేశం చిత్రాలతో వరుస విజయాల్ని అందుకున్న  విషయం తెలిసిందే. రేపటి నుంచే ఈ ప్రాజెక్ట్‌ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.

భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీలో  క్యూట్ బ్యూటీ నజ్రియా ఫహద్ నటిస్తుంది. సూర్యకు జోడీగా వెండితెరపై ఆమె కనిపించనుంది. చాలారోజుల తర్వాత ఒక పాన్‌ ఇండియా సినిమాలో ఆమె భాగం కానుంది. ప్రముఖ నటుడు ఫహద్ ఫాసిల్‌కు నజ్రియా సతీమణి అనే విషయం తెలిసిందే. ఫహద్ ఫాసిల్‌, దర్శకుడు జీతూ మాధవన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఆవేశం సినిమా భారీ హిట్‌ అందుకున్న విషయం తెలిసిందే.

ప్రేమలు, కొత్తలోక మూవీస్‌తో పాపులర్‌ అయిన  యంగ్ హీరో నస్లెన్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ సుశిన్ శ్యామ్ సంగీతం అందిచడం విశేషం. ‘ఆవేశం’ లాంటి ఒక మాస్ ఎనర్జిటిక్ మూవీ తర్వాత జిత్తు మాధవన్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. శక్తిమంతమైన పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో సూర్య కనిపించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement