టాలీవుడ్‌ డైరెక్టర్‌తో సూర్య సినిమా.. అధికారిక ప్రకటన వచ్చేసింది! | Kollywood Star Hero Suriya Next Film With Tollywood Crazy Director, Watch Video Went Viral | Sakshi
Sakshi News home page

Suriya:టాలీవుడ్‌ డైరెక్టర్‌తో సూర్య సినిమా.. అధికారిక ప్రకటన వచ్చేసింది!

Apr 27 2025 7:09 AM | Updated on Apr 27 2025 4:26 PM

Kollywood Star Hero Suriya Next Film with Tollywood Crazy Director

కోలీవుడ్ స్టార్‌ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రెట్రో’. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించారు. జ్యోతిక, సూర్య నిర్మించిన ఈ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ రిలీజ్‌ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రెట్రో మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన విజయ్‌ దేవరకొండ హాజరయ్యారు.

ఈ ఈవెంట్‌లో హీరో సూర్య ఫ్యాన్స్‌కు ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన వచ్చే మూవీని టాలీవుడ్‌ డైరెక్టర్‌తోనే తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఈ విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూర్యనే స్వయంగా ప్రకటించారు. దీంతో సూర్య టాలీవుడ్ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

సూర్య గజిని సినిమా వచ్చినప్పుడు నా ఇంజినీరింగ్‌ పూర్తయిందని దర్శకుడు వెంకీ అట్లూరి తెలిపారు. ఆ సినిమాను థియేటర్లో చూసి ఒక సినిమా ఇలా కూడా ఉంటుందా అనిపించిందన్నారు. సూర్య సన్‌ ఆఫ్‌ కృష్ణన్ చూసినప్పుడు.. లవ్‌, ఫెయిల్యూర్, క్రమశిక్షణ నేర్పిన సినిమా సార్ అది అని వెంకీ అన్నారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement