
తమిళనాడులోని పళని దేవాలయానికి హీరో సూర్య అండ్ టీమ్ వెళ్లారు. సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. మమితా బైజు హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రంలో రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ నెల 9న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది.
ఈ సందర్భంగా పళని దేవాలయంలో మురుగన్‌ని దర్శించుకుని, పూజలు నిర్వహించి, ‘‘ఓ మేజర్ స్టెప్ వేసేందుకు సన్నద్ధమౌతున్నాం. దేవుడి ఆశీర్వాదం కోసం పళని దేవాలయానికి వచ్చాం’’ అని యూనిట్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించనున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్.