
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఏడాది 50 ఏళ్ల వయసులోకి అడుగుపెడుతున్నప్పటికీ, చూడటానికి 30 ఏళ్ల యువకుడిలా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. వయసుతో పాటు ఆయన అందం కూడా పెరుగుతూనే ఉంది. రోజురోజుకూ మరింత ఫిట్‌గా, హ్యాండ్సమ్‌గా కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు. తాజాగా, సూర్య తన కూతురు దియాతో కలిసి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో సూర్య, దియా తండ్రి-కూతుళ్లలా కాకుండా అన్నా-చెల్లెల్లా కనిపించారు. సూర్య యంగ్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతూ, ‘మా హీరో రోజురోజుకూ మరింత యంగ్‌గా మారుతున్నాడు’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ వీడియోని షేర్ చేస్తున్నారు.
సూర్య ప్రస్తుతం దర్శకుడు వెంకీ అట్లూరి ఆధ్వర్యంలో కొత్త సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం ఆయన హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే తన కూతురు దియాని కూడా వెంటబెట్టుకొని హైదరాబాద్ చేరుకున్నాడు. ఎయిర్‌పోర్ట్‌లో టీషర్ట్‌లో సింపుల్‌గా కనిపించిన సూర్య, తన ఫిట్‌నెస్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు.
సూర్య కూతురు దియా సాధారణంగా పబ్లిక్‌లో ఎక్కువగా కనిపించదు. ఆమెకు సంబంధించిన వివరాలు కూడా పెద్దగా బయటకు రాలేదు. ఇటీవల దియా తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, ఆ ఫోటోలను సూర్య భార్య జ్యోతిక సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమె గురించి అందరికీ తెలిసింది. చదువు పూర్తి చేసిన దియా ఇప్పటి వరకు సినిమా రంగంలోకి అడుగుపెట్టలేదు. అయితే, తండ్రితో కలిసి షూటింగ్ కోసం హైదరాబాద్ రావడం ఆసక్తికరంగా మారింది. ఎయిర్‌పోర్ట్‌లో సూర్య, దియా కలిసి నడుచుకుంటూ వెళ్లిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సూర్య ఫిట్‌నెస్, యంగ్ లుక్‌కు అభిమానులు మరోసారి ఆకర్షితులవుతూ, అతడి స్టైల్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Exclusive @Suriya_offl ❤️ #Suriya46 pic.twitter.com/3a5nMaE9Au
— Suriya Fanatics Kerala ™ (@TeamSFK__Offl) June 8, 2025