రెట్రో మూవీ ట్విటర్‌ రివ్యూ.. సందడి లేదేంటి? | Suriya, Pooja Hegde Starrer Retro Movie Twitter Review | Sakshi
Sakshi News home page

Retro X Review: రెట్రో మూవీ ట్విటర్‌ రివ్యూ.. కనిపించని సందడి

May 1 2025 8:15 AM | Updated on May 1 2025 11:20 AM

Suriya, Pooja Hegde Starrer Retro Movie Twitter Review

సినీ ప్రియులకు నేడు డబుల్‌ ధమాకా.. అటు నాని హీరోగా నటించిన హిట్‌ 3 రిలీజవుతుండగా.. ఇటు సూర్య నటించిన రెట్రో (Retro Movie) కూడా సరిగ్గా ఇదే రోజు (మే 1న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహించిన రెట్రో చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందించిన ఈ సినిమా గురించి ఎక్స్‌ (ట్విటర్‌)లో ఎటువంటి సందడి కనిపించడం లేదు.

కనిపించని సందడి
ఈ సినిమాకు ప్రీమియర్స్‌ వేసినట్లు లేరు. చాలాచోట్ల ఇప్పుడిప్పుడే షోలు పడుతున్నాయి. దీంతో జనాల రెస్పాన్స్‌ తెలియడానికి మరికాస్త సమయం పట్టేట్లు ఉంది. విదేశాల్లో ప్రీమియర్‌ షోలు వేయడం వల్ల పని కట్టుకుని కొందరు నెగెటివ్‌ ప్రచారం చేస్తున్నారని.. దీన్ని అరికట్టేందుకే రెట్రో టీమ్‌ ఎర్లీ షోలు ఎత్తేసిందని ప్రచారం జరుగుతోంది. కొన్నిచోట్ల మాత్రం తొలి షో అయిపోయిందని.. సినిమా బాగుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

కంగువా డిజాస్టర్‌.. ఈసారైనా..
అసలే సూర్య (Suriya) చివరి సినిమా కంగువా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమా ఎలాగైనా హిట్టవ్వాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అటు పూజా హెగ్డే (Pooja Hegde) సైతం ఈ చిత్ర ప్రమోషన్స్‌లో తెగ కష్టపడింది. ఎక్కడికి వెళ్లినా 'కనిమా..' అంటూ తన పాటకు స్టెప్పులేసింది. మరి వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందో, లేదో చూడాలి!

 

 

చదవండి: నాని ‘హిట్‌ 3’ సినిమాకి ఊహించని టాక్‌.. అదే మైనస్‌ అట!

Advertisement
 
Advertisement
Advertisement