కోలీవుడ్‌ స్టార్‌ హీరోతో మూవీ ఛాన్స్‌ దక్కించుకున్న పూజా హెగ్డే | Pooja Hegde Got Movie Chance With Surya | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌ స్టార్‌ హీరోతో మూవీ ఛాన్స్‌ దక్కించుకున్న పూజా హెగ్డే

Published Mon, Jun 3 2024 1:25 PM | Last Updated on Mon, Jun 3 2024 1:40 PM

Pooja Hegde Got Movie Chance With Surya

నటుడు సూర్య ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలన్నీ భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నవే. అందులో కంగువ చిత్రం ఒకటి. పీరియాడికల్‌  కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పూర్తిచేసిన సూర్య ప్రస్తుతం కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ, స్టోన్‌ బెంచ్‌ సంస్థ కలిసి నిర్మిస్తున్నాయి. కాగా జనరంజకమైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథా చిత్రంగా తెరకెక్కనున్న  ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఇది ఆయన నటిస్తున్న 44 చిత్రం అవుతుంది. దీనికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతాన్ని అందించనున్నారు. షూటింగ్‌ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. 

తొలి షెడ్యూల్‌ అండమాన్‌లో నిర్వహించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా ఇందులో సూర్యతో నటించే నటి ఎవరన్న సస్పెన్స్‌ ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చింది. అయితే పూజా హెగ్డే ఇందులో కథానాయకిగా నటిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. కాగా ఆ విషయాన్ని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించారు. పూజా హెగ్డేకు ఈ చిత్రం చాలా కీలకం కానుంది. 

ఎందుకంటే 12 ఏళ్ల క్రితం ముగముడి అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. కాగా చాలా కాలం తర్వాత ఈ మధ్య విజయ్‌ సరసన బీస్ట్‌ చిత్రంలో నటించారు. ఆ చిత్రంపై పూజాహెగ్డే చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ చిత్రం ఫ్లాప్‌ కావడంతో ఆమెపై ఐరన్‌ లెగ్‌ అనే ముద్రపడింది. అదేసమయంలో తెలుగులో కూడా పూజాహెగ్డే నటించిన చిత్రాలు బాగా ఆడలేదు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతానికి ఆమె చేతుల్లో ఒక్క చిత్రం కూడా లేదు. ఇలాంటి కష్టకాలంలో సూర్య సరసన నటించే అవకాశం రావడం నిజంగా ఆమెకు లక్కే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement