కంగువా చూశాక ఆ సినిమాలే గుర్తుకొస్తాయి: సూర్య | Suriya opened up about his upcoming release Kanguva Movie | Sakshi
Sakshi News home page

Kanguva Movie: ఆ సినిమాల రేంజ్‌లో కంగువాను తీసుకొస్తున్నాం: సూర్య

Oct 23 2024 4:58 PM | Updated on Oct 23 2024 5:09 PM

Suriya opened up about his upcoming release Kanguva Movie

కోలీవుడ్ స్టార్ హీరో ప్రస్తుతం కంగువా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దసరాకే రావాల్సిన ఈ చిత్రం వేట్టయాన్ రావడంతో బాక్సాఫీస్ బరి నుంచి తప్పుకుంది. ఈ భారీ యాక్షన్‌ సినిమాను శివ దర్శకత్వంలో తెరకెక్కించారు. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుందని కంగువా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

రిలీజ్ తేదీ దగ్గర పడుతుండంతో కంగువా టీమ్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌ సూర్యతో పాటు హీరోయిన్ దిశాపటానీ, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంగువా గురించి సూర్య పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మూవీ కచ్చితంగా హాలీవుడ్‌ చిత్రాన్ని తలపిస్తుందని అన్నారు. ఈ సినిమా బ్రేవ్‌హార్ట్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్‌ లాంటి హాలీవుడ్ చిత్రాలను గుర్తు చేసేలా ఉంటుందని తెలిపారు. 

సూర్య మాట్లాడుతూ..'మనం బ్రేవ్‌హార్ట్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, అపోకలిప్టో వంటి చిత్రాలను ఇష్టపడతాం. వాటిని చూసి ఆశ్చర్యానికి గురవుతాం కూడా. ఆ సినిమాలు చాలాసార్లు చూశాం. మేము కూడా ఇప్పుడు అలాంటి సినిమాలే చేయబోతున్నాం. ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన శివకు వచ్చింది. అ‍ప్పటి ప్రజలు ఎలాంటి జీవితాన్ని గడిపారు? వారికి ఎదురైన కష్టాలేంటి? అనే విషయాలను తెరపై ఆవిష్కరిస్తే బాగుంటుందని చెప్పాడు. ఆ విధంగానే కంగువాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. విజువల్‌ ఎఫెక్ట్స్‌, కథ విషయంలో శివ చాలా ప్రతిభావంతుడు. అతను థియేటర్‌లో కంగువా చూశాక మీకే తెలుస్తుంది" అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో విలన్‌గా బాబీ డియోల్ నటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement