రెండో బ్యానర్‌ స్టార్ట్‌ చేయనున్న హీరో సూర్య! | Suriya Ready To Launch New Banner Zhagaram Studios, Rumours Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Suriya: కొత్త బ్యానర్‌ లాంచ్‌ చేయనున్న సూర్య, ఫస్ట్‌ సినిమా ఎవరిదంటే?

Oct 1 2025 8:53 AM | Updated on Oct 1 2025 10:12 AM

Buzz, Suriya Ready To Launch New Banner Zhagaram Studios

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య (Suriya) డబ్బింగ్‌ సినిమాలతో తెలుగువారికి దగ్గరయ్యారు. తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నేరుగా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. ఇకపోతే ఈయన తన భార్య జ్యోతికతో కలిసి 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే! తాజాగా సూర్య మరో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

నగరం స్టూడియోస్‌ పేరుతో కొత్త బ్యానర్‌ లాంచ్‌ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంస్థలో మొదటి చిత్రంగా మలయాళ దర్శకుడు జీతూ మాధవన్‌ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించి నిర్మించనున్నట్లు తెలిసింది. ఆ తరువాత పా.రంజిత్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం సూర్య నటించిన కరుప్పు చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల కానుందని తెలిసింది. ఆ తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం తెరపైకి రానుంది.

చదవండి: జ్ఞాపకాలను మోయడం ఆపేశాను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement