సూర్య కొత్త సినిమాలో హీరోయిన్‌ 'అనఘా రవి'కి ఛాన్స్‌ | Malayalam Actress Anagha Ravi Get Movie Chance With Surya In Suriya 45, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

సూర్య కొత్త సినిమాలో హీరోయిన్‌ 'అనఘా రవి'కి ఛాన్స్‌

Apr 11 2025 6:53 AM | Updated on Apr 11 2025 10:22 AM

Malayalam Actress Anagha Ravi Get Movie Chance With Surya

 కోలీవుడ్‌ నటుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న రెట్రో చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంత కార్యక్రమాలు జరుపుకుంటోంది. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే నాయకిగా నటించారు. కాగా రెట్రో చిత్రం మే ఒకటవ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో సూర్య తన తర్వాతి ప్రాజక్ట్‌ 45 చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ప్రతాపంపై ఎస్సార్‌ ప్రకాష్‌రాజ్‌, ఎస్సార్‌ ప్రభు నిర్మిస్తున్నారు. సాత్విక, యోగిబాబు, నట్టి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాయి అభయంకర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. 

చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టెయినర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. కాగా ఇందులో మరో మలయాళ బ్యూటీ ఎంట్రీ ఇచ్చారన్నది తాజా సమాచారం. మలయాళంలో కథానాయకిగా మంచి పేరు సంపాదించుకున్న అనఘా రవి(Anagha Ravi) సూర్య 45వ చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ఈమె తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొన్నారు. సూర్య కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రంలో తను కీలక పాత్రను పోషిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. 

ఈమె తాజాగా మలయాళంలో నటించిన అళపుళ జింఖానా చిత్రం గురువారం తెరపైకి వచ్చింది. ఈమె సూర్య చిత్రం ద్వారా కోలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించనున్నారన్న మాట. మమ్ముట్టి, జ్యోతిక కలిసి నటించిన 'కాతల్‌' సినిమాలో అనఘా రవి వారికి కూతురిగా నటించింది. అందులో ఆమె నటనకు భారీగా ప్రశంసలు వచ్చాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement