పిల్లాడికి బంగారు చైన్‌ బహుమతిచ్చిన సూర్య | Actor Suriya Gifts Gold Chain to One Year Old Kid, Watch Video | Sakshi
Sakshi News home page

చిన్నారికి హీరో గోల్డ్‌ చైన్‌ గిఫ్ట్‌.. జీవితంలో మర్చిపోలేమంటూ.

Dec 19 2025 3:05 PM | Updated on Dec 19 2025 3:19 PM

Actor Suriya Gifts Gold Chain to One Year Old Kid, Watch Video

అభిమాన హీరో ఆటోగ్రాఫ్‌ ఇస్తే ఆనందంలో మునిగి తేలుతారు. సెల్ఫీ ఇస్తే సంతోషంతో ఉప్పొంగిపోతారు. కానీ, ఆ హీరో ఏకంగా తమ ఫ్యామిలీ సెలబ్రేషన్స్‌లో భాగమైతే.. ఇంకేమైనా ఉందా? అది జీవితంలో మర్చిపోలేని బహుమతి అవుతుంది. నటుడు చరణ్‌కు ఇలాంటి సర్‌ప్రైజే ఇచ్చాడు హీరో సూర్య. చరణ్‌​ కుమారుడి చర్విక్‌ మొదటి బర్త్‌డేను వారి కుటుంబానికి లైఫ్‌లాంగ్‌ను గుర్తుండిపోయేలా చేశాడు. బుడ్డోడిని ఎత్తుకుని ఆడించాడు. అంతేకాకుండా ఎవరూ ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు.

బంగారు గొలుసు కానుక
పిల్లవాడి మెడలో బంగారు గొలుసును వేశాడు. చర్విక్‌ను అతడి తల్లి ఎత్తుకుని ఉండగా సూర్య ఎంతో ఉత్సాహంగా గోల్డ్‌ చైన్‌ను బహుకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో చరణ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. లెజెండరీ యాక్టర్‌ సూర్య ఇచ్చిన సర్‌ప్రైజ్‌ చూసి మా దిమ్మ తిరిగిపోయింది. మా బాబు చర్విక్‌ ఫస్ట్‌ బర్త్‌డే పురస్కరించుకుని బంగారు చైన్‌ను గిఫ్టిచ్చాడు. ఇది కేవలం బహుమతి మాత్రమే కాదు, ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ మధురమైన జ్ఞాపకం అని చరణ్‌ ఎక్స్‌ (ట్విటర్‌)లో రాసుకొచ్చాడు.

తెలుగులో సినిమా
ఇకపోతే సూర్య చివరగా రెట్రో మూవీలో కనిపించాడు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. ఒకటి (#Suriya46) ఆయన తెలుగులో స్ట్రయిట్‌ సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మమిత బైజు హీరోయిన్‌. రవీనా టండన్‌, రాధికా శరత్‌కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించాడు. 

సూర్య 47వ మూవీ
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే వేసవిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి 'విశ్వనాథన్‌ అండ్‌ సన్స్‌' అనే టైటిల్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే సూర్య.. రోమాంచమ్‌, ఆవేశం సినిమాల ఫేమ్‌ జీతూ మాధవన్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా (#Suriya47) చేస్తున్నాడు. ఇందులో నజ్రియా హీరోయిన్‌గా నటిస్తోంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement