'సూర్య'ను కాదనుకున్న కీర్తి సురేశ్‌.. తెలుగు హీరో కోసమేనా? | Did Keerthy Suresh Not Interested Surya Movie | Sakshi
Sakshi News home page

'సూర్య'ను కాదనుకున్న కీర్తి సురేశ్‌.. తెలుగు హీరో కోసమేనా?

May 29 2025 12:11 PM | Updated on May 29 2025 1:03 PM

Did Keerthy Suresh Not Interested Surya Movie

కీర్తి సురేశ్‌.. చిత్ర పరిశ్రమలో ఎలాంటి పాత్రలోనైనా సరే తన నటనతో సత్తా చూపించగలరు. తమిళ హీరో సూర్య కూడా ఆ కోవకు చెందిన నటుడిగానే గుర్తింపు ఉంది. అయితే, సూర్యతో నటించే ఛాన్స్‌ వచ్చినప్పటికీ కీర్తి వదులుకుందని వార్తలు వస్తున్నాయి. పెళ్లి తర్వాత కీర్తి మళ్లీ బిజీ అవుతుంది. బాలీవుడ్‌ తన మొదటి సినిమా 'బేబీ జాన్‌' నిరాశ పరిచినప్పటికీ మళ్లీ అక్కడే మరో ఛాన్స్‌ దక్కించుకుంది. కీర్తి కోసం ఇప్పటికే  పలువురు బాలీవుడ్‌ దర్శకనిర్మాతలు ఆమెతో చర్చలు చేస్తున్నట్లు  తెలుస్తోంది.  దేశంలోని ప్రస్తుత విద్యా వ్యవస్థ విధానంపై బాలీవుడ్‌లో ఒక మూవీని ప్లాన్‌ చేస్తున్నారు. నటుడు రాజ్‌కుమార్‌ రావుతో (Raj Kumar Rao) కలిసి కీర్తి నటించనున్నట్లు సమాచారం. ‘సెక్టార్‌ 36’ ఫేమ్‌ ఆదిత్య నింబాల్కర్‌ దర్శకత్వం వహించనున్నారని సమాచారం.

అదే విధంగా తెలుగులో విజయ్‌ దేవరకొండకు జంటగా కీర్తి సురేశ్‌( Keerthy Suresh) నటించే ఛాన్స్‌ అందుకున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో తమిళం, తెలుగు భాషల్లో సూర్య కథానాయకుడిగా నటిస్తున్న  46వ చిత్రంలోనూ కథానాయకిగా నటించే అవకాశం ఆమెను వరించిందట, అయితే ఆమె విజయ్‌దేవరకొండకు జంటగా నటించనున్నడం వల్ల సూర్యతో కలిసి నటించే ఛాన్స్‌ను వదులుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.  అయితే ఇందులో నిజం ఎంతనో తెలియాల్సి ఉంది. మొత్తం మీద కీర్తి వివాహానంతరం మళ్లీ బిజీ అవుతున్నారన్నమాట. కాగా ఈమె ఇంతకుముందు సూర్యకు జంటగా 'గ్యాంగ్‌' చిత్రంలో నటించారన్నది గమనార్హం.  

వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న సూర్య.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా రెట్రోతో మెప్పించిన ఆయన తాజాగా మరో సినిమాను మొదలుపెట్టారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన నటించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ దీనిని నిర్మిస్తున్నారు. సార్‌, లక్కీ భాస్కర్‌ వంటి చిత్రాలతో సౌత్‌ చిత్రపరిశ్రమలో తనదైన ముద్రను వెంకీ అట్లూరి వేశారని చెప్పవచ్చు.
 

Advertisement
 
Advertisement
Advertisement