'అమ్మ, నాన్న పెట్టిన పేరు అదే'.. హీరో సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్! | Kollywood Hero Suriya Interesting Comments About Her Life Journey In Movie Career, Deets Inside | Sakshi
Sakshi News home page

Suriya: 'నా పేరు సూర్య కాదు.. అమ్మ, నాన్నకు స్పెషల్ సిటీ ఇదే'

Oct 27 2024 6:44 PM | Updated on Oct 28 2024 10:35 AM

Kollywood Hero Suriya Comments About Her Journey In Cinema

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఇటీవల ముంబయి, హైదరాబాద్‌లో ఫుల్ బిజీగా ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. శివ దర్శకత్వంలో వస్తోన్న హిస్టారికల్‌ యాక్షన్‌ మూవీ కంగువా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్.. ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు.

తాజాగా ఇవాళ వైజాగ్‌లో కంగువా చిత్రయూనిట్ సభ్యులు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో సూర్యతో పాటు డైరెక్టర్‌ శివ, నిర్మాత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సూర్య పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వైజాగ్ సిటీ నా జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాలను అందించిందని అన్నారు. మా అమ్మ, నాన్నలకు ఎంతో ఇష్టమైన నగరాల్లో వైజాగ్‌ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంటుందన్నారు.  

హీరో సూర్య మాట్లాడుతూ..'వైజాగ్ సిటీ నాకు చాలా ప్రత్యేకం. అంతేకాదు ఈ రోజు నాకు స్పెషల్ డే. 2015లో సింగం-3 షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చా. ఇక్కడ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. దాదాపు 40 ఏళ్ల క్రితం అమ్మ, నాన్న వైజాగ్‌కు వచ్చారు. కానీ ఆ తర్వాత నా సినిమా షూటింగ్స్‌ అప్పుడు కూడా ఇద్దరు వచ్చేవారు. ఇక్కడ ప్రజల ప్రేమ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని నాతో అన్నారు. నాకు మా అమ్మ, నాన్న పెట్టిన పేరు శరవణన్. సినిమాల్లోకి వచ్చాకే నా పేరు సూర్యగా మారింది. నా పట్ల తల్లిదండ్రుల ప్రేమ ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేను. నా పట్ల అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కంగువా సినిమా చూడాలని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. కంగువా చిత్రం వచ్చేనెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement