షోలో కన్నీళ్లు పెట్టుకున్న హీరో సూర్య | Unstoppable Show Suriya Episode Promo | Sakshi
Sakshi News home page

Suriya Unstoppable 4: జ్యోతిక లేకుండా నా జీవితం ఊహించుకోలేను

Nov 5 2024 10:54 AM | Updated on Nov 5 2024 1:00 PM

Unstoppable Show Suriya Episode Promo

తమిళ స్టార్ హీరో సూర్య.. బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' షోలో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోని ఇప్పుడు రిలీజ్ చేశారు. దాదాపు నాలుగున్న నిమిషాల ఈ వీడియోలో సూర్యతో పాటు 'కంగువ' దర్శకుడు శివ, నటుడు బాబీ డియోల్ కూడా పాల్గొన్నారు. కంగువ సినిమా.. ఈనెల 14న థియేటర్లలోకి రానుంది. 

(ఇదీ చదవండి: డబ్బు లాక్కొని హీరోయిన్‌ని భయపెట్టిన బిచ్చగాడు)

సూర్యని ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేసిన బాలకృష్ణ.. ఎవరికీ తెలియని విషయాల్ని కూడా రాబట్టినట్లు తెలుస్తోంది. ఎవరినైనా ప్రేమించావా అని అడిగితే.. వద్దు సర్ ఇప్పుడు పెళ్లయిపోయింది అని సూర్య అన్నాడు. కానీ తమ్ముడు కార్తితో ఫోన్ మాట్లాడిన టైంలో మాత్రం ఓ హీరోయిన్‌పై అన్నయ్యకు క్రష్ ఉందని చెప్పిన కార్తీ.. బాలయ్యకే షాకిచ్చాడు.

'అగరం' ఫౌండేషన్ స్థాపించి ఎందరో విద్యార్థులకు సూర్య అండగా నిలుస్తున్నాడు. గతంలో ఓసారి అమ్మాయి స్టేజీపై మాట్లాడుతుంటే పక్కనే ఉన్న సూర్య కన్నీళ్లు పెట్టుకున్నాడు.  ఇప్పుడు 'అన్‌స్టాపబుల్' షోలోనూ ఆ వీడియో ప్లే చేయగా.. సూర్య మళ్లీ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఫుల్ ఎపిసోడ్ ఈ శుక్రవారం (నవంబర్ 8న) రిలీజ్ అవుతుంది.

(ఇదీ చదవండి: డైరెక్టర్ క్రిష్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా?)

Advertisement
 
Advertisement
Advertisement