'రెట్రో' కలెక్షన్స్‌ విడుదల.. సూర్య కెరీర్‌లో ఇదే టాప్‌ | Suriya Retro Movie Final Collections Crossed Rs 200 Crores, Check Out For Full Collections Details Inside | Sakshi
Sakshi News home page

'రెట్రో' కలెక్షన్స్‌ విడుదల.. సూర్య కెరీర్‌లో ఇదే టాప్‌

May 19 2025 8:33 AM | Updated on May 19 2025 10:58 AM

Suriya Retro Movie Final Collections

రెట్రో సినిమాతో సూర్య భారీ హిట్‌ అందుకున్నాడు. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. సూర్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా రెట్రో రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. గతేడాదిలో భారీ అంచనాలతో విడుదలైన ‘కంగువా’ చిత్రం  సూర్య (Suriya)కు చేదు అనుభవాన్ని మిగిల్చినా రెట్రో మాత్రం  ఆ లోటును తీర్చింది. అయితే, తెలుగులో అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ యాక్షన్‌ చిత్రంగా మే 1న రెట్రో విడుదలైంది. ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటించగా.. జోజూ జార్జ్‌, జయరామ్‌, నాజర్‌ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. యాక్షన్‌తో పాటు, ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ఒక గ్యాంగ్‌స్టర్‌గా సూర్య ఇందులో నటించాడు.

రెట్రో సినిమా 18 రోజుల్లో రూ. 235 కోట్లు రాబట్టినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఇందులో అత్యధికంగా తమిళనాడులోనే ఎక్కువ కలెక్షన్స్‌ వచ్చాయి. సూర్య కెరీర్‌లో అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా మొదటి స్థానంలో రెట్రో ఉంది. ఆ తర్వాత 24 మూవీ రూ. 157  కోట్లు, సింగం2 రూ. 122 కోట్లు, కంగువా రూ. 106 కోట్లు, 7th సెన్స్‌ రూ. 113 కోట్లు, సికిందర్ రూ. 95 కోట్లతో వరుసగా ఉన్నాయి. రెట్రో సినిమాకు 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ భారీగానే దెబ్బ కొట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం టాక్‌ బాగుండటంతో కోలీవుడ్‌లో మంచి కలెక్షన్స్‌ రాబట్టింది. లేదంటే రెట్రో కలెక్షన్స్‌ సులువుగా రూ. 300 కోట్లకు దగ్గర్లో ఉండేవని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement