
రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ మూవీ దురంధర్ (Dhurandhar Movie). సంజయ్ దత్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రల్లో నటించారు. నేడు (జూలై 6) రణ్‌వీర్ బర్త్‌డే సందర్భంగా దురంధర్ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో హీరో మాస్ అవతార్‌లో కనిపించాడు. అలాగే ఓ హీరోయిన్‌ను ఎత్తుకుని తిప్పుతూ కనిపించాడు.

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్‌గా..
ఆ హీరోయిన్ మరెవరో కాదు.. చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్. ప్రముఖ నటుడు రాజ్ అర్జున్ కూతురే సారా. సౌత్‌లో బాలనటిగా ఎన్నో సినిమాలు చేసిన ఆమె.. దురంధర్‌తో హీరోయిన్‌గా వెండితెరపై ఎంట్రీ ఇస్తోంది. ఈమె తెలుగులో దాగుడుమూత దండాకోర్ చిత్రంలో రాజేంద్రప్రసాద్ మనవరాలిగా నటించింది. నాన్న మూవీలో విక్రమ్ కూతురిగా మెప్పించింది. తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. పొన్నియన్ సెల్వన్ మూవీలో ఐశ్వర్యరాయ్ చిన్ననాటి పాత్రలో మెరిసింది.
20 ఏళ్ల ఏజ్ గ్యాప్
చైల్డ్ ఆర్టిస్ట్‌గా బోలెడంత పాపులారిటీ సంపాదించిన సారా.. అప్పుడే హీరోయిన్‌గా మారడంతో సినీప్రియులు ఆశ్చర్యపోతున్నారు. అందులోనూ 40 ఏళ్ల రణ్‌వీర్‌తో 20 ఏళ్ల సారా కలిసి నటించడంపై అప్పుడే చర్చ మొదలైంది. వీళ్లిద్దరూ జంటగా నటించారా? లేదంటే ఏదైనా మిషన్ కోసం ఇలా కలిశారా? అన్నది క్లారిటీ రావాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. అదే రోజు ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ రిలీజ్ అవుతుండటం గమనార్హం.
చదవండి: కోలీవుడ్ స్టార్ విజయ్‌ను చూసి మన తెలుగు హీరోలు నేర్చుకోవాలి