ప్రేమ,రక్తపాతం 'సూర్య' రెట్రో తెలుగు టీజర్‌ | Suriya Retro Telugu Teaser Out Now | Sakshi
Sakshi News home page

ప్రేమ,రక్తపాతం 'సూర్య' రెట్రో తెలుగు టీజర్‌

Feb 8 2025 10:48 AM | Updated on Feb 8 2025 11:26 AM

Suriya Retro Telugu Teaser Out Now

తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కొత్త సినిమా 'రెట్రో' నుంచి తాజాగా తెలుగు టీజర్‌ విడుదలైంది. గతేడాది కంగువ సినిమాతో అభిమానులను నిరాశ పరిచిన సూర్య.. ఇప్పుడు ప్రేమ, యాక్షన్‌ అంశాలతో తన కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డేతో సూర్య జంటగా నటించిన ఈ చిత్రాన్ని కార్తీక్‌ సుబ్బరాజ్‌ తెరకెక్కించారు. భారీ బడ్జెట్‌తో 2డీ ఎంటర్‌టైన్‌మెంట్, స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. మే 1న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.

కార్తిక్ సుబ్బరాజు సినిమాలన్నీ సమ్‌థింగ్ డిఫరెంట్ అనేలా ఉంటాయి. సూర్యతో చేసిన 'రెట్రో' టీజర్ చూస్తుంటే హిట్ కళ కనిపిస్తోంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే సూర్యకి హీరోగా కమ్ బ్యాక్ దొరుకుతుంది. ఎందుకంటే గత మూడేళ్లుగా 'కంగువ' కోసం పనిచేశారు. కానీ ఫలితం అనుకున్నట్లు రాలేదు. ఇప్పుడు 'రెట్రో' హిట్ కావడం అనేది సూర్య కెరీర్‌కి చాలా కీలకం.

Advertisement
 
Advertisement
Advertisement