
కోలీవుడ్ టాప్ హీరో సూర్య, కార్తీ కుటుంబ సభ్యులు అందరూ చెన్నైలోని ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి కుటుంబ ఆద్వర్యంలో నడుస్తున్న అగరం ఫౌండేషన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభోత్సవంలో సందడిగా కనిపించారు. ఈ కార్యక్రమంలో సూర్య తండ్రి నటుడు శివకుమార్, సోదరి బృందా, జ్యోతికతో పాటు వారి పిల్లలు అందరూ పాల్గొన్నారు. సుమారు ఏడాది తర్వాత ఈ కార్యక్రమం కోసం ముంబై నుండి చెన్నైకి జ్యోతిక పిల్లలతో పాటు వచ్చారు.
అగరం ఫౌండేషన్ అనేది నటుడు సూర్య నేతృత్వంలోని ఎడ్యుకేషనల్ ఫౌండేషన్. గత 20 సంవత్సరాలుగా, అతని కుటుంబ సభ్యులు అట్టడుగు ఆర్థిక వర్గాల విద్యార్థులకు వారి కలలను సాధించడంలో సహాయం చేస్తున్నారు. చెన్నైలో ఫౌండేషన్ కొత్త కార్యాలయాన్ని ఇటీవల ప్రారంభించారు. తమిళంలో అగరం అంటే 'అ'కారం... అంటే తొలి అక్షరం అని సూర్య తెలిపారు. ఈ ఫౌండేషన్‌కు తెలుగువారు భారీ స్థాయిలో విరాళాలు అందించినట్లు గతంలో సూర్య ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

అయితే, బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి తమ సొంత డబ్బుతో నిర్మించామన్నారు. సుమారు 20 ఏళ్ల పాటు కష్టానికి ప్రతిఫలం ఈ భవనం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. పిల్లల విద్య కోసం తమ సంస్థకు వచ్చిన విరాళాల నుంచి ఒక్క రూపాయి కూడా బిల్డింగ్ నిర్మాణం కోసం ఉపయోగించలేదన్నారు. సినిమా నుంచి తమకు వచ్చిన రెమ్యునరేషన్‌లో కొంత మొత్తాన్ని దాచిపెట్టి నిర్మించామన్నారు. ప్రస్తుతం ఏడాదికి 700-800 మందికి మాత్రమే సహాయం చేయగలుగుతున్నామని ఆయన అన్నారు. భవిష్యత్‌లో ఈ సంఖ్యను పెంచేందుకే ఈ భవన నిర్మాణం చేశామని ఆయన తెలిపారు.
సూర్య తండ్రి శివకుమార్ అతని కుటుంబ సభ్యులు చాలా అరుదుగా బహిరంగంగా కనిపిస్తారు. ఈ ఫోటోలలో ఆయన సతీమణి లక్ష్మితో పాటు వారి కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. ప్రస్తుతం నెట్టింట వీడియోలతో పాటు ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
• Exclusive - @Karthi_Offl , @Suriya_offl With Family At Inaugration Of New @agaramvision 's Office | #Karthi #VaaVaathiyaar #Sardar2 #Karthi29 #Kaithi2 #Retro pic.twitter.com/w5qvDxukqW
— MKB Santhosh (@MKB_SANTHOSH23) February 16, 2025