
సూర్య.. కొన్నాళ్ల క్రితమే 'రెట్రో'తో ప్రేక్షకుల్ని పలకరించాడు. తమిళంలో పర్లేదు గానీ తెలుగులో ఘోరమైన డిజాస్టర్ అయింది. ప్రస్తుతం 'కరుప్పు' అనే మూవీ చేస్తున్నాడు. దీనికి ఆర్జే బాలాజీ దర్శకుడు. కొన్నిరోజుల క్రితం గ్లింప్స్ రిలీజ్ చేశారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‍గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. దీనితో పాటు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితోనూ సూర్య ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులోనే ప్రముఖ సంగీత దర్శకుడి సోదరి లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు)
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సోదరి భవాని శ్రీ.. సూర్య-వెంకీ అట్లూరి మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. భవాని శ్రీ ఇంతకుముందు పావ కథైగల్, కాపే రణసింగం సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. సూరికి జంటగా 'విడుదలై' చిత్రంలోనూ కథానాయికిగా నటించింది. తాజాగా సూర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో ఈమె పాత్ర ఏమిటి అన్నది ఆసక్తిగా మారింది. ఈ సినిమాలో సూర్య సరసన మలయాళ బ్యూటీ మమిత బైజు చేస్తోంది. మరి భవాని శ్రీ కూడా సూర్యకు హీరోయిన్ లేదా మరేదైనా పాత్ర అనేది తెలియాల్సి ఉంది. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
(ఇదీ చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన 'బిగ్‌బాస్' ఫేమ్ గౌతమ్)